Fenugreek-Black Cumin Benefits: మెంతులను వీటితో కలిపి తీసుకుంటే.. మీకున్న అనారోగ్య సమస్యలన్నీ పరారవుతాయ్!

సమస్త ఔషధాలకు నిలయం మన వంటిల్లు. వంటింట్లో ఉండే ప్రతి ఆహార పదార్థంతో మనం ఎదుర్కొనే వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. వాటిలో మెంతులు కూడా ఉన్నాయి. మెంతులు నానబెట్టి తిన్నా, మెంతులు నానబెట్టిన నీటిని తాగినా షుగర్ తగ్గుతుందన్న విషయం తెలిసిందే. జుట్టు సంబంధిత సమస్యలకు కూడా మెంతులు చక్కని పరిష్కారం. మెంతుల్లో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు మనకు చక్కని ఆరోగ్యాన్ని అందిస్తాయి. మెంతుల పొడిని వంటల్లో..

Fenugreek-Black Cumin Benefits: మెంతులను వీటితో కలిపి తీసుకుంటే.. మీకున్న అనారోగ్య సమస్యలన్నీ పరారవుతాయ్!
Fenugreek-Black Cumin Benefits
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 27, 2023 | 7:00 AM

సమస్త ఔషధాలకు నిలయం మన వంటిల్లు. వంటింట్లో ఉండే ప్రతి ఆహార పదార్థంతో మనం ఎదుర్కొనే వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. వాటిలో మెంతులు కూడా ఉన్నాయి. మెంతులు నానబెట్టి తిన్నా, మెంతులు నానబెట్టిన నీటిని తాగినా షుగర్ తగ్గుతుందన్న విషయం తెలిసిందే. జుట్టు సంబంధిత సమస్యలకు కూడా మెంతులు చక్కని పరిష్కారం. మెంతుల్లో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు మనకు చక్కని ఆరోగ్యాన్ని అందిస్తాయి. మెంతుల పొడిని వంటల్లో కూడా వాడుతుంటాం.

మెంతులు, కాళోంజి విత్తనాలు (నల్ల జీలకర్ర) కలిపి తీసుకుంటే.. ఇంకా మంచి ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిలో పీచు పదార్థాలు, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి అనేక పోషకాలున్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

ఉదర సమస్యలు తగ్గుతాయి: మెంతులు – కాళోంజీ విత్తనాలను సమానంగా తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. పరగడుపునే ఈ నీటిని తాగితే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది: మెంతులు, కాళోంజి విత్తనాలను కలిపి తీసుకుంటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ఈ రెండింటినీ నానబెట్టిన నీరు తాగితే.. సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.

క్యాన్సర్ కు దూరంగా ఉండొచ్చు: షుగర్ వ్యాధి ఉన్నవారికి ఈ రెండూ.. మహా ఔషధంలా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతాయి. అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

అధిక బరువు ఉండదు: మెంతులు – కాళోంజీ విత్తనాలను కలిపి తీసుకుంటే.. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి.. బరువు తగ్గడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

చర్మం, జుట్టు ఆరోగ్యం: చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ రెండింటినీ దోరగా వేయించి విడివిడిగా పొడిచేసి.. పరగడుపున అర టీ స్పూన్ మోతాదులో 1 గ్లాసు వేడినీటిలో కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి.

ఇలా మెంతులు, కాళోంజి విత్తనాలు (నల్లజీలకర్ర) వల్ల ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికి కూడా సహాయపడుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..