AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: పూరీ, చపాతీ పిండిని మరుసటి రోజు వాడుతున్నారా.. ఇది ఎన్ని ప్రమాదాలకు దారి తీస్తుందో తెలుసా?

ఇప్పుడు డైట్ మీద దృష్టితో చాలా మంది ఉదయం, రాత్రి చపాతీలను తీసుకుంటున్నారు. మరికొంత మంది ఇంట్లో అందరూ ఉన్నప్పుడు, ఖాళీ సమయంలో పూరీ, చపాతీలను బ్రేక్ ఫాస్ట్ గా చేస్తూంటారు. ఒక్కొక్కసారి పూరీ పిండి, చపాతి పిండి మిగిలిపోతూ ఉంటుంది. దీంతో ఆ పిండిని డబ్బాలో పెట్టి.. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారు. మరుసటి రోజు దాన్ని వాడుతూ ఉంటారు. అయితే ఇలా మిగిలిపోయిన పిండిని మర్నాడు వాడితే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని..

Kitchen Hacks: పూరీ, చపాతీ పిండిని మరుసటి రోజు వాడుతున్నారా.. ఇది ఎన్ని ప్రమాదాలకు దారి తీస్తుందో తెలుసా?
home tips
Chinni Enni
|

Updated on: Sep 10, 2023 | 6:17 PM

Share

ఇప్పుడు డైట్ మీద దృష్టితో చాలా మంది ఉదయం, రాత్రి చపాతీలను తీసుకుంటున్నారు. మరికొంత మంది ఇంట్లో అందరూ ఉన్నప్పుడు, ఖాళీ సమయంలో పూరీ, చపాతీలను బ్రేక్ ఫాస్ట్ గా చేస్తూంటారు. ఒక్కొక్కసారి పూరీ పిండి, చపాతి పిండి మిగిలిపోతూ ఉంటుంది. దీంతో ఆ పిండిని డబ్బాలో పెట్టి.. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారు. మరుసటి రోజు దాన్ని వాడుతూ ఉంటారు. అయితే ఇలా మిగిలిపోయిన పిండిని మర్నాడు వాడితే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు ఆహార నిపుణులు.

ఫ్రిడ్జ్ లో ఉంచిన పిండిపై బ్యాక్టీరియా చేరుతుంది:

సాధారణంగా పూరీ పిండి కానీ, చపాతీ పిండి కానీ కలిపిన రెండు, మూడు గంటల లోపే వాడేయాలి. ఇంకాస్త లేట్ అయినా.. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టినా.. అందులో అనేక రసాయనిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ పిండికి బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి చేరతాయి. అలాగే ఫ్రిడ్జ్ లో ఉంచి తీసినప్పుడు ఆ పిండి కాస్త నలుపు రంగులోకి మారతుంది. అంటే ఆ పిండిపై సూక్ష్మి క్రిములు ఎటాక్ చేశాయని అర్థం చేసుకోవాలి. అలా నలుపు రంగులోకి వచ్చిన పిండిని అస్సలు వాడకూడదు.

ఇవి కూడా చదవండి

జీర్ణ క్రియ సమస్యలు తలెత్తుతాయి:

ఒక వేళ ఆ పిండిని యూజ్ చేస్తే.. కడుపులో నొప్పి, ఉబ్బరం, నొప్పి, అజీర్తి, గ్యాస్, మల బద్ధకం, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కోక తప్పదు. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి.

గోధుమ పిండిలోని పోషకాలు కోల్పోతాం:

సాధారణంగా గోధుమ పిండిలో జింక్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఫ్రిడ్జ్ లో ఆ పిండిని నిల్వ చేయడం వల్ల ఆ పోషకాల విలువ పోతుంది. ఇలాంటి పిండితో చేసిన ఆహారం తింటే షుగర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి చపాతీ పిండిని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కలుపుకుని వాడుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..