Corn Benefits: మొక్కజొన్న కండిలను ఇలా తింటే.. అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం!!

చల్లచల్లని వర్షం పడుతూ ఉన్నప్పుడు.. వేడి వేడి మొక్క జొన్నలకు ఉప్పు, కారం, నిమ్మ కాయ పెట్టి తింటే.. వావ్ ఇక మాటల్లో చెప్పలేం. చదువుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా.. వెంటనే మొక్క జొన్న తినాలని అనిపిస్తుంది కదా. వర్షాకాలంలోనే ఈ మొక్క జొన్నలు లభిస్తాయి. కేవలం స్నాక్ లానే తీసుకునే వీటిల్లో ఎన్నో పోషక విలువులు ఉన్న సంగతి మీకు తెలుసా. వీటితో వడలు, బజ్జీలు, గారెలు ఎన్ని వేసుకున్నా.. మొక్క జొన్న పొత్తులను తింటేనే అసలు మజా వస్తుంది. సీజన్ ల ద్వారా దొరికేవి కాబ్టటి....

Corn Benefits: మొక్కజొన్న కండిలను ఇలా తింటే.. అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం!!
Corn
Follow us
Chinni Enni

|

Updated on: Sep 10, 2023 | 5:00 PM

చల్లచల్లని వర్షం పడుతూ ఉన్నప్పుడు.. వేడి వేడి మొక్క జొన్నలకు ఉప్పు, కారం, నిమ్మ కాయ పెట్టి తింటే.. వావ్ ఇక మాటల్లో చెప్పలేం. చదువుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా.. వెంటనే మొక్క జొన్న తినాలని అనిపిస్తుంది కదా. వర్షాకాలంలోనే ఈ మొక్క జొన్నలు లభిస్తాయి. కేవలం స్నాక్ లానే తీసుకునే వీటిల్లో ఎన్నో పోషక విలువులు ఉన్న సంగతి మీకు తెలుసా. వీటితో వడలు, బజ్జీలు, గారెలు ఎన్ని వేసుకున్నా.. మొక్క జొన్న పొత్తులను తింటేనే అసలు మజా వస్తుంది. సీజన్ ల ద్వారా దొరికేవి కాబ్టటి.. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ఒక మొక్క జొన్న పొత్తులో.. విటమిన్ ఏ, ఈ, బీ6, రైబో ప్లేవిన్, థయామిన్, 88 క్యాలరీల శక్తి, 1.4 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, జింక్, మాంగనీస్, ఫైబర్, 9.4 గ్రాముల ప్రోటీన్, 19 గ్రాముల కార్పో హైడ్రేట్స్ కాపర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మరి ఈ మొక్క జొన్నతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? మొక్క జొన్నను ఎలా తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ శక్తి మెరుగు పడుతుంది:

ఇవి కూడా చదవండి

మొక్క జొన్నలో ఉండే ఫైబర్ జీర్ణ శక్తి పెరిగేందుకు సహాయ పడుతుంది. దీంతో మల బద్ధంకం సమస్య తీరుతుంది.

కంటి చూపు మెరుగు పడుతుంది:

మొక్క జొన్నలో ఉండే పోషకాల కారణంగా కంటి చూపు మెరుగు పడుతుందని చెబుతున్నారు నిపుణులు.

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి:

దొరికిన సమయంలో మొక్క జొన్న తింటూ ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయిలులు అదుపులోకి వస్తాయి.

చర్మం – జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది:

మొక్క జొన్నలు తినడం వల్ల చర్మం అందంగా, కాంతి వంతంగా తాయరు అవుతుంది. వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

గుండె హెల్దీగా ఉంటుంది:

మొక్క జొన్నను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రక్త హీనత సమస్య కూడా ఉండదు.

క్యాన్సర్ వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు:

మొక్క జొన్న తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా ఉంటాం.

పిల్లల్లో ఎదుగుదల:

మొక్క జొన్న తినడం వల్ల పిల్లలో మంచి ఎదుగుదల కనిపిస్తుంది. పిల్లలు కూడా బలంగా, బరువు పెరుగుతారు.

మొక్క జొన్న పొత్తులను ఎలా తినాలంటే:

మొక్క జొన్న పొత్తులను ఉడికించి, కాల్చుకుని తింటూంటారు. కొంత మంది ఉడికించిన మొక్క జొన్న పై ఉప్పు, కారం జల్లుకుని తింటారు. మరికొంత మంది కాల్చిన పొత్తులపై నిమ్మకాతో ఉప్పు, కారం అదిమి తింటూంటారు. అలాగే వడలు, గారెలు కూడా చేసుకుని తింటారు. ఇలా తినడం వల్ల నష్టాలే కానీ ప్రయోజనాలు ఉండని నిపుణులు చెబుతున్నారు.

మొక్క జొన్నలను పూర్తిగా ఉడికించుకుని తినాలి. అలాగే కాల్చికుని కూడా తినవచ్చు. అయితే ఉప్పు, కారం, నిమ్మకాయ లేకుండా తీసుకోవాలని అంటున్నారు. ఇవి సరిగ్గా ఉడకపోయినా, కాల్చకపోయినా.. కడుపులో నొన్పి, డయేరియా, అజీర్తి వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!