AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Drink: ఈ డ్రింక్ ను రోజూ రాత్రి తాగితే.. బలంగా తయారవ్వడంతో పాటు రక్తం కూడా పడుతుంది!

శరీరం బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఏ పనినైనా చేసుకోగలం. లేదంటే చాలా కష్ట పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే. ఏది మంచిదో.. ఎలాంటి ఆహార పదార్థాలను వాడుతున్నారో తెలీడం లేదు. అయినా చాలా మంది బయటనే జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయారు. వాటిల్లో మసాలాలు, కారాలు, సాస్ లు తప్పించి.. ఆరోగ్యానికి అవసరైమనవి ఏమీ ఉండటం లేదు. దీంతో బలం లేక నిస్సత్తువగా తయారవుతున్నారు. దీంతో బలహీనత, నీరసం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయి. శరీరానికి తగినంత శక్తిని ఇస్తేనే బాడీ బలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం..

Healthy Drink: ఈ డ్రింక్ ను రోజూ రాత్రి తాగితే.. బలంగా తయారవ్వడంతో పాటు రక్తం కూడా పడుతుంది!
Healthy Drink
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 11, 2023 | 6:45 AM

Share

శరీరం బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఏ పనినైనా చేసుకోగలం. లేదంటే చాలా కష్ట పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే. ఏది మంచిదో.. ఎలాంటి ఆహార పదార్థాలను వాడుతున్నారో తెలీడం లేదు. అయినా చాలా మంది బయటనే జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయారు. వాటిల్లో మసాలాలు, కారాలు, సాస్ లు తప్పించి.. ఆరోగ్యానికి అవసరైమనవి ఏమీ ఉండటం లేదు. దీంతో బలం లేక నిస్సత్తువగా తయారవుతున్నారు. దీంతో బలహీనత, నీరసం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయి. శరీరానికి తగినంత శక్తిని ఇస్తేనే బాడీ బలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం తయారు చేసుకునే పొడిని రోజూ ఓ గ్లాస్ పాలలో కలుపుకుని తాగితే.. కొద్ది రోజుల్లోనే తేడా కనిపిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిగా కూడా పని చేస్తుంది. మరి ఆ పొడి ఏంటి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

నువ్వులు – రెండు స్పూన్లు, గసగసాలు – రెండు స్పూన్లు, బాదం పప్పులు – 8

ఇవి కూడా చదవండి

హెల్దీ డ్రింక్ తయారీ విధానం:

ముందుగా నువ్వులు, గసగసాలు, బాదం పప్పులను తీసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని.. ఓ గ్లాస్ పాలల్లో కలిపి పిల్లలకు, పెద్దలకు, వయసు మళ్లిన వాళ్లకు ఇస్తే బలంగా తయారవుతారు. వారిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. పాలతో తాగడం ఇష్టం లేని వారు గోరు వెచ్చటి నీటిలో అయినా కలుపుకుని తాగవచ్చు.

ఓ రెండు స్పూన్ పొడిని పాలలో వేసుకుని ఓ ఐదు నిమిషాలు మరిగించుకోవాలి. నెక్ట్స్ ఇవి గోరు వెచ్చగా ఉన్నప్పుడు బెల్లం పొడిని కలుపుకుని తాగిలి. బెల్లం పొడి అంటే ఇష్టం లేని వారు పటిక బెల్లాన్ని అయినా కలుపుకోవచ్చు. ఇలా చేసుకున్న పొడి ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో లేదా రాత్రి పడుకునే ముందు తాగినా పర్వాలేదు. గసగసాలు నిద్ర రావడానికి సహకరిస్తాయి. కాబట్టి రాత్రి సమయంలోనే తీసుకుంటేనే ఉత్తమం. ఈ డ్రింక్ తాగితే కలిగే ప్రయోజనాలు:

1. నిద్ర కూడా బాగా పడుతుంది. 2. నీరసం, బలహీనత వంటివి తగ్గుతాయి. 3. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. 4. జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. 5. ఎనర్జిటిక్ గా ఉండేందుకు సహాయ పడుతుంది 6. రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. 7. మతి మరుపు రాకుండా చూస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..