AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exercise at Home: సమయం లేక జిమ్ కి వెళ్లలేక పోతున్నారా.. ఇంట్లోనే హ్యాపీగా ఇలాంటి వ్యాయామాలు చేయండి!

ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా.. దేని మీదైనా సరైన విధంగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలోనే వారి ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టలేక.. పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రతీ వ్యక్తి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. అయితే కొంత మంది సమయాభావం వల్ల జిమ్ లకు వెళ్ల లేక పోతూంటారు. మరికొంత మంది బద్ధకంతో దూరంగా ఉంటారు. అలాంటి వారు ఇంట్లోనే చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తూ హెల్దీగా, ఫిట్ గా ఉండొచ్చు. మరి ఆవేంటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు..

Exercise at Home: సమయం లేక జిమ్ కి వెళ్లలేక పోతున్నారా.. ఇంట్లోనే హ్యాపీగా ఇలాంటి వ్యాయామాలు చేయండి!
Exercise At Home
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 11, 2023 | 8:45 AM

Share

ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా.. దేని మీదైనా సరైన విధంగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలోనే వారి ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టలేక.. పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రతీ వ్యక్తి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. అయితే కొంత మంది సమయాభావం వల్ల జిమ్ లకు వెళ్ల లేక పోతూంటారు. మరికొంత మంది బద్ధకంతో దూరంగా ఉంటారు. అలాంటి వారు ఇంట్లోనే చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తూ హెల్దీగా, ఫిట్ గా ఉండొచ్చు. మరి ఆవేంటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాకింగ్ చేయడం:

కొంత మందికి కుదరకు, వెళ్లే సమయం కూడా లేక కనీసం పార్కుల్లో వాకింగ్ కూడా చేయలేక పోతున్నారు. ఇలాంటి వారు చక్కగా ఇంట్లోనే వాకింగ్ చేసుకోవచ్చు. బయట ఎలా వాకింగ్ చేస్తామో.. ఇంట్లోనే ఉదయం పూట వాకింగ్ చేయవచ్చు. ఇంటి బయటైనా లేదా మేడ పైన అయినా చేయవచ్చు. కనీసం రోజులో 5 వేల అడుగుల వాకింగ్ అయినా చేస్తే బెటర్. ఇవి వెంటనే ఫలితం ఇవ్వకపోయినా.. కొద్ది కొద్దిగా తేడా మీకే తెలుస్తుంది. ఇలా వాకింగ్ చేస్తూనే.. జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటూ మంచి డైట్ ఫాలో అయితే మరిన్ని బెటర్ రిజల్ట్స్ మీ సొంతం అవుతాయి. ఇలా చేయడంలో నడుము, తొడల భాగంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అలాగే గుండె ఆరోగ్యంతో పాటు, బరువు కూడా తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

డ్యాన్స్ చేయడం:

డ్యాన్స్ చేసినా కూడా చాలా కేలరీలు ఖర్చు అవుతాయి. మీకు ఇష్టమైన పాటలు పెట్టుకుని ఉదయాన్నే కొన్ని రకాలైన స్టెప్పులను ఫాలో చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల యాక్టీవ్ గా, ఉత్సాహంగా ఉంటారు. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటివి ఉన్నా దూరమవుతాయి. ఇలా ఓ గంట సేపు డ్యాన్స్ చేస్తే సుమారు 500 కేలరీలు బర్న్ అవుతాయి. ఇలా డ్యాన్స్ చేయడం వల్ల కూడా బరువు తగ్గడంతో పాటు.. కొవ్వు కరుగుతుంది.

మెట్లు ఎక్కి దిగటం:

మెట్లు ఎక్కి దిగటం కూడా ఒక ఎక్సర్ సైజ్ గా ఉంటుంది. జిమ్ లకు వెళ్లి వ్యాయామలు చేయలేని వారు.. ఇలా మెట్లు ఎక్కి దిగటం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. బాడీలో ఉన్న అధిక కొవ్వు కరగడమే కాకుండా.. బరువు కూడా తగ్గుతారు. అలాగే ఊబకాయం, డయాబెటీస్ కూడా తగ్గిస్తుంది. ఆందోళన, ఒత్తిడి ఉన్నా పరార్ అవుతాయి. దీన్ని ఒక బరువుగా కాకుండా.. నవ్వుతూ, పాటలు వింటూ కూడా చేయవచ్చు. అప్పుడు మరింత హుషారు వస్తుంది.

యోగా చేయడం:

యోగా చేయడం వల్ల కూడా అనే వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దీంతో ఒత్తిడి దూరం అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా చేస్తూనే డైట్ మీద కూడా కాన్సన్ ట్రేట్ చేస్తే బెటర్. బరువు కూడా తగ్గుతారు. యోగా వల్ల ప్రశాంతంతో పాటు ఫిట్ గా కూడా ఉండొచ్చు.

మీకు ఇష్టమైన స్పోర్ట్స్ ఆడటం:

బిజీ లైఫ్ కారణంగా సరైన సమయం దొరకడం లేదు. ఇలాంటి వారు రోజూ కాస్త సమయాన్ని మీకు ఇష్టమైన గేమ్స్ ఆటడానికి కేటాయించాలి. దీంతో మానసిక ఆనందంతో పాటు స్ట్రెస్ బస్టర్ అవుతుంది. టెన్నీస్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ ఇలాంటి వాటివి ఆడితే.. కొలెస్ట్రాల్ ను, రక్త పోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి