Period Acne: పీరియడ్స్ సమయంలో మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి!!

చాలా మందికి పీరియడ్స్ వచ్చే సమయంలో ముఖంపై మొటిమలు వస్తాయి. అవి చాలా నొప్పిగా ఉంటాయి. నెలసరి సమయంలో చర్మంపై నూనె వంటి సెబమ్ ఉత్పత్తి కారణంగా ముఖంపై మొటిమలు వస్తూంటాయి. ప్రీమెన్ స్ట్రల్ సిండ్రోల్ మొక్క ప్రాథమిక లక్షణాల్లో పింపుల్స్ రావడం కూడా ఒకటి. పీరియడ్స్ సమయంలో చాలా మంది ఆడవారు ఈ సమస్యలను ఎదుర్కొన వలసి వస్తుంది. బుతు స్రావం సమయంలో శరీరంలో హార్మోన్ల ఇన్ బేలన్స్ వల్ల ఇలా వస్తూంటాయి పింపుల్స్. అలాగే బాడీలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, ప్రొజెస్టరాన్ స్థాయిలు పెరుగుతున్న సమయంలో సెబమ్ ఉత్పత్తి..

Period Acne: పీరియడ్స్ సమయంలో మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి!!
Periods Precautions
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 11, 2023 | 9:45 AM

చాలా మందికి పీరియడ్స్ వచ్చే సమయంలో ముఖంపై మొటిమలు వస్తాయి. అవి చాలా నొప్పిగా ఉంటాయి. నెలసరి సమయంలో చర్మంపై నూనె వంటి సెబమ్ ఉత్పత్తి కారణంగా ముఖంపై మొటిమలు వస్తూంటాయి. ప్రీమెన్ స్ట్రల్ సిండ్రోల్ మొక్క ప్రాథమిక లక్షణాల్లో పింపుల్స్ రావడం కూడా ఒకటి. పీరియడ్స్ సమయంలో చాలా మంది ఆడవారు ఈ సమస్యలను ఎదుర్కొన వలసి వస్తుంది. బుతు స్రావం సమయంలో శరీరంలో హార్మోన్ల ఇన్ బేలన్స్ వల్ల ఇలా వస్తూంటాయి పింపుల్స్. అలాగే బాడీలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, ప్రొజెస్టరాన్ స్థాయిలు పెరుగుతున్న సమయంలో సెబమ్ ఉత్పత్తి అవుతుంది.

పీరియడ్స్ వచ్చే సమయంలో ఉత్పత్తి అయ్యే సెబమ్ స్త్రీలలో వివిధ ప్రభావాలను కలిగిస్తుంది. కొందరికి ముఖంపై మొటిమలను, డల్ స్కిన్ ఏర్పడితే, మరికొంత మందికి ముఖంపై గ్లోను పెంచుతుంది. మరికొందరిలో స్కిన్ పై జిడ్డును ఉత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో వచ్చిన పింపుల్స్ కొద్ది రోజులకు పోతాయి. మరికొందరికి వాపుగా, స్కిన్ ఎరుపుగా, దురదగా మారతాయి. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించడం మేలు. మచ్చలు, మొటిమలతో బాధపడుతున్న వారికి.. చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చర్మ నిపుణులను సంప్రదిస్తే.. దానికి సంబంధించిన క్రీములను కానీ మెడిసన్స్ కానీ ఇస్తారు. వారి సూచన మేరకు ఉపయోగించాలి. మొటిమలను నివారించడంలో కొన్ని రకాల చిట్కాలు చూద్దాం.

అజెలైక్ యాసిడ్: దీన్ని ఉపయోగించడం వల్ల మొటిమల వల్ల వచ్చిన వాపును తగ్గించడమే కాకుండా.. బ్యాక్టీరియా కూడా నశించేలా చేస్తుంది. అలాగే మచ్చలు, రంగు మారడం వంటి సమస్యలు తగ్గించడమే కాకుండా.. స్కిన్ టోన్ ను కూడా మెరుగు పరుస్తుంది.

ఇవి కూడా చదవండి

సమయోచిత రెటినాయిడ్స్: ఇది విటమిన్ ఏతో తయారువుతుంది. ఇది చర్మా నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే రంధ్రాలను తొలగిస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ని నివారించడంలో బాగా హెల్ప్ చేస్తుంది.

హోమ్ టిప్స్:

– పసుపు యాంటీ బయోటిక్ గా పని చేస్తుంది. కాబట్టి మొటిమలను తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతుంది. మొటిమలపై కాస్త పసుపు పేస్ట్ ను రాస్తే.. ఉపశమనం ఉంటుంది.

– తులసి ఆకుల రసం కూడా మొటిమలపై రాస్తూ ఉంటే.. యాంటీ బయోటిక్ గా వర్క్ చేస్తుంది.

– ఉసిరి కాయ పేస్ట్ ను కూడా మొటిమలు, మచ్చలపై రాసి, అరగంట తర్వాత క్లీన్ చేసుకుంటే.. మొటిమలు తగ్గుతాయి.

– వేపాకు పేస్ట్ కూడా మొటిమలపై రాస్తే.. ఉన్న వాటిని తగ్గించడమే కాకుండా.. మొటిమలు రాకుండా చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?