AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedies: జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించే కషాయం.. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది!

ప్రస్తుతం ఇప్పుడున్న కాలానికి ఏదైనా ఈజీగా, ఫాస్ట్ గా అయిపోవాలి. వ్యాధులు కూడా అలాగే తగ్గాలని మెడికల్ షాపుకు వెళ్లి.. పవర్ ఎక్కువగా ఉన్న వాటిని వాడుతున్నారు. దీంతో మరిన్ని అనారోగ్య సమస్యలని కొని తెచ్చుకుంటున్నారు. అధిక బరువు, కడుపులో ఉబ్బరం, మంట, గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తున్నాయి. అలా కాకుండా ముందుగా ఇంటి చిట్కాలు పాటిస్తే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ హోమ్ టిప్స్ వల్ల ప్రయోజనాలే కానీ.. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్నది వర్షాకాలం. తొందరగా వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. దీంతో జ్వరం, బాడీ పెయిన్స్, దగ్గు, జలుబు..

Home Remedies: జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించే కషాయం.. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది!
Kashayam
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 10, 2023 | 7:00 AM

ప్రస్తుతం ఇప్పుడున్న కాలానికి ఏదైనా ఈజీగా, ఫాస్ట్ గా అయిపోవాలి. వ్యాధులు కూడా అలాగే తగ్గాలని మెడికల్ షాపుకు వెళ్లి.. పవర్ ఎక్కువగా ఉన్న వాటిని వాడుతున్నారు. దీంతో మరిన్ని అనారోగ్య సమస్యలని కొని తెచ్చుకుంటున్నారు. అధిక బరువు, కడుపులో ఉబ్బరం, మంట, గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తున్నాయి. అలా కాకుండా ముందుగా ఇంటి చిట్కాలు పాటిస్తే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ హోమ్ టిప్స్ వల్ల ప్రయోజనాలే కానీ.. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటున్నారు.

ప్రస్తుతం ఇప్పుడున్నది వర్షాకాలం. తొందరగా వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. దీంతో జ్వరం, బాడీ పెయిన్స్, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. ఇవి వచ్చాయంటే వారం రోజుల దాకా వెళ్లవు. ముఖ్యంగా వాతావరణ మార్పులే ఈ వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం. వీటి వలన కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఏ పని మీదైనా ధ్యాస ఉంచలేం. వీక్ గా అనిపిస్తూ ఉంటుంది. వయసులో సంబంధం లేకుండా చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా అందరూ ఈ వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. మందులకు బదులుగా ఇంట్లోని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఇప్పుడు దగ్గు, జలుబు తగ్గేందుకు కషాయాన్ని చూద్దాం. ఈ కషాయాన్ని తాగితే.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యల నుంచి రిలీఫ్ గా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. బ్యాచిలర్స్ కూడా ఎంతో సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఆ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

కావాల్సి పదార్థాలు:

ఒక టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ వాము, జీల కర్ర, యాలకులు, ఐదు లవంగాలు, ఐదు మిరియాలు, అర టీ స్పూన్ శొంఠి పొడి, ఒక దాల్చిన చెక్క ముక్క.. వీటన్నింటినీ ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పౌడర్ ని ఓ గాజు సీసాలో భద్ర పరుచుకోవాలి.

తయారీ విధానం:

ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసి.. అందులో ఒక టీ స్పూన్ పొడిని వేయాలి. ఇలా ఐదు నుంచి 10 నిమిషాల పాటు మరిగించుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కషాయం గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. తాగలేని వారు ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే వాతావరణం మార్పుల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి