Constipation Tips: మలబద్ధకం సమస్య వేధిస్తోందా.. అయితే ఇవి తినండి!!

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది మల బద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మొదట్లోనే ఈ సమస్యను నియంత్రించ లేకపోతే.. దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది. మూల శంఖ, ప్రేగు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మనం తినే ఆహారంలో సరైన విధంగా ఫైబర్ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుంది. అలాగే నీళ్లు తాగక పోవడం, తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, శరీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయక పోవడం వల్ల కూడా మల బద్ధకం ఏర్పడవచ్చు. దీని వల్ల కడుపులో మంట, కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. బాత్రూమ్ వెళ్లేందుకు ఇబ్బంది..

Constipation Tips: మలబద్ధకం సమస్య వేధిస్తోందా.. అయితే ఇవి తినండి!!
Fruits Benefits
Follow us
Chinni Enni

|

Updated on: Sep 08, 2023 | 6:12 PM

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది మల బద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మొదట్లోనే ఈ సమస్యను నియంత్రించ లేకపోతే.. దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది. మూల శంఖ, ప్రేగు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మనం తినే ఆహారంలో సరైన విధంగా ఫైబర్ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుంది. అలాగే నీళ్లు తాగక పోవడం, తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, శరీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయక పోవడం వల్ల కూడా మల బద్ధకం ఏర్పడవచ్చు. దీని వల్ల కడుపులో మంట, కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. బాత్రూమ్ వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నా, పొడిగా వస్తున్నా, గట్టిగా వస్తున్నా, వెళ్లే చోట నొప్పి పుడుతున్నా, పూర్తిగా విసర్జన చేయలేక ఇబ్బంది పడుతున్న కూడా మల బద్ధకం సమస్యగా చెప్పవచ్చు. ఇలాంటి వారు పీచు పదార్థం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి. మరి ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం.

అరటి పండ్లు:

మల బద్ధకం సమస్య తగ్గించడంలో ముఖ్యంగా ముందుగా గుర్తొచ్చేది అరటి పండ్లు. ఇవి వీటిలో ఉండే పీచు పదార్థం మల బద్ధకాన్ని నివారిస్తుంది. జీవక్రియను, పేగు కదలికలను ఈజీగా చేస్తుంది. అలాగే పొట్టను క్లీన్ చేస్తుంది అరటి పండు. క్రమం తప్పకుండా రోజూ ఒక అరటి పండు తినడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. చిన్న వారి నుంచి పెద్దవారి వరకూ అరటి పండును తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అంజీర్:

అంజీర్ లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంజీర్ ను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే.. ఆరోగ్యంతో పాటు మల బద్ధకం కూడా తగ్గుతుంది. ఇవి పేగు కదలికలను మెరుగు పరిచి, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి హెల్ప్ చేస్తుంది.

కివి ఫ్రూట్:

కివి ఫ్రూట్ గురించి అందరికీ తెలుసు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, రోగ నిరోధక శక్తి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ ఫ్రూట్ తీసుకున్నా.. మల బద్ధకం సమస్య తగ్గుతుంది.

ఆల్ బుకారా:

ఆల్ బుకారా కూడా మల బద్ధకం సమస్యను తగ్గించేందుకు చక్కగా పని చేస్తుంది. ఇందులో ఫైబర్, ఫైటో న్యూట్రియెంట్లు, సార్బిటాల్ వంటివి అధికంగా ఉంటాయి. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. అలాగే పేగు కదలికలను సులభతరం చేసి, మల బద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్యే కాకుండా.. ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి