Ashwagandha for Nerves: నరాల బలహీనతతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి!!

ఇప్పుడు కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడాల్సి వస్తోంది. దీనికి ముఖ్య కారణం.. బీజీ లైఫ్, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేకపోవడం. ఇలా అనేక కారణాల వల్ల మనిషి జబ్బుల బారిన పడాల్సి వస్తోంది. ఇప్పుడు అందర్నీ వేధించే మరో సమస్య.. నరాల బలహీనత. ఈ సమస్య ముఖ్య లక్షణాలు ఏంటంటే.. తలనొప్పి, ఏ పనీ చేయలేక పోవడం, జ్ఞాప‌క శ‌క్తి మందగించడం, తిమ్మిర్లు, స్పర్శ కోల్పోవడం, కండరాలు బలం కోల్పోవడం, కాళ్లు, చేతులు ఎత్తలేకపోవడం. ఒత్తిడి కారణంగా నరాల్లో రక్త సరఫరా సరిగ్గా లేవపోడంతో ఈ సమస్య తలెత్తుతుంది. ఈ నరాల బలహీనత సమస్యను..

Ashwagandha for Nerves: నరాల బలహీనతతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి!!
nerves
Follow us
Chinni Enni

|

Updated on: Sep 08, 2023 | 5:00 PM

ఇప్పుడు కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడాల్సి వస్తోంది. దీనికి ముఖ్య కారణం.. బీజీ లైఫ్, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేకపోవడం. ఇలా అనేక కారణాల వల్ల మనిషి జబ్బుల బారిన పడాల్సి వస్తోంది. ఇప్పుడు అందర్నీ వేధించే మరో సమస్య.. నరాల బలహీనత. ఈ సమస్య ముఖ్య లక్షణాలు ఏంటంటే.. తలనొప్పి, ఏ పనీ చేయలేక పోవడం, జ్ఞాప‌క శ‌క్తి మందగించడం, తిమ్మిర్లు, స్పర్శ కోల్పోవడం, కండరాలు బలం కోల్పోవడం, కాళ్లు, చేతులు ఎత్తలేకపోవడం.

ఒత్తిడి కారణంగా నరాల్లో రక్త సరఫరా సరిగ్గా లేవపోడంతో ఈ సమస్య తలెత్తుతుంది. ఈ నరాల బలహీనత సమస్యను ఎదుర్కొంటున్న వారు చాలా బాధను, ఇబ్బందిని భరిస్తూ ఉంటారు. అయితే ఈ సమస్యను ఆయుర్వేదంలోని కొన్ని చిట్కాల ద్వారా నయం చేసుకోవచ్చు. అయితే కొంత సమయం పడుతుంది. వ్యాధి నయం అయ్యేంత వరకూ ఆయుర్వేద చిట్కాలను వాడుతూ ఉండాలి. ఆ చిట్కాలు ఏంటో, ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేద చిట్కాలు:

ఇవి కూడా చదవండి

*నరాల బలహీనతతో బాధ పడే వారికి అతి మధురం పొడి, అశ్వ గంధ పొడి చాలా చక్కగా వర్క్ చేస్తుంది. ఈ రెండింటిని సమ పాలల్లో తీసుకుని పొడి కిందా చేసుకుని ఓ గాసు సీసాలో భద్ర పరుచుకోవాలి.

*ఒక టీ స్పూన్ ఈ పొడిని.. గోరు వెచ్చటి పాలల్లో కలిపి తాగాలి. ఉదయం, రాత్రి రెండు పూటలా రెండు నెలలు పాటు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నరాల బలహీనత సమస్య తగ్గు ముఖం పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అతిబల చెట్టు కట్టెలు కూడా నరాల బలహీనత సమస్యకు ఉపయోగపడుతుంది. ఇది ఎలా వాడాలి? ఎలా వాడితే బెనిఫిట్స్ అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* వేలు మందం ఉన్న అతిబల చెట్టు కట్టె ముక్కలను ఆరింటిని తీసుకుంటూ రాగి తీగతో చుట్టాలి. తర్వాత గిన్నెలో పాలు పోసి.. ఈ కట్టెలతో కలుపుతూ మరిగిస్తే.. పాలు గట్టిగా ఒక ముద్దలా అవుతాయి. దీన్ని ఆరబెడితే పొడి అవుతుంది. ఈ పొడిలో చక్కెర కలుపుకుని తినడం వల్ల నరాల బలహీనత సమస్య తగ్గుతుంది.

ఈ చిట్కాలను అన్ని రకాల వయసు వారు ఎలాంటి సందేహాలు లేకుండా ఉపయోగించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆయుర్వేదం కాబట్టి.. ఈ చిట్కాలను వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా కలగవు. ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తూనే.. కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. తీపి పదార్థాలకు, జంక్ ఫుడ్ కు, ప్రాసెస్డ్ ఫుడ్ కి, వేయించి ఆహార పదార్థాలకు, చేపలు, ఆక్రోట్, అవిసె గింజలు, ఆకు కూరలు, పండ్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే యోగా, ధ్యానం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి