AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wearing socks at Night: రాత్రి పడుకునే ముందు కాళ్లకు సాక్సులు వేసుకుని నిద్రిస్తే.. బోలెడన్ని బెనిఫిట్స్!

సాధారణంగా సాక్సులను ఉద్యోగాలకు వెళ్లినప్పుడు, పిల్లలు స్కూల్ కి వెళ్లేటప్పుడు మాత్రమే ధరిస్తారు. సాక్స్ వల్ల పాదాలకు రక్షణగా ఉంటాయి. అలాగే బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు పాదాలకు చేరకుండా ఉంటాయి. అయితే చమట పట్టి సాక్సుల్లో కూడా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సాక్సులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అయితే మీరు ఎప్పుడైనా కాళ్లకు సాక్సులు ధరించి నిద్రపోయారా.. లేదు కదా. కానీ ఇకపై రాత్రి పూట కాళ్లకు సాక్సులు ధరించి నిద్రపోతే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయట. రాత్రి పూట కాళ్లకు సాక్సులు ధరించి నిద్రపోతే రక్త సరఫరా పెరుగుతుందట. అలాగే రక్త నాళాలు కూడా..

Wearing socks at Night: రాత్రి పడుకునే ముందు కాళ్లకు సాక్సులు వేసుకుని నిద్రిస్తే.. బోలెడన్ని బెనిఫిట్స్!
Socks
Chinni Enni
|

Updated on: Sep 08, 2023 | 3:24 PM

Share

సాధారణంగా సాక్సులను ఉద్యోగాలకు వెళ్లినప్పుడు, పిల్లలు స్కూల్ కి వెళ్లేటప్పుడు మాత్రమే ధరిస్తారు. సాక్స్ వల్ల పాదాలకు రక్షణగా ఉంటాయి. అలాగే బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు పాదాలకు చేరకుండా ఉంటాయి. అయితే చమట పట్టి సాక్సుల్లో కూడా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సాక్సులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అయితే మీరు ఎప్పుడైనా కాళ్లకు సాక్సులు ధరించి నిద్రపోయారా.. లేదు కదా. కానీ ఇకపై రాత్రి పూట కాళ్లకు సాక్సులు ధరించి నిద్రపోతే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయట. రాత్రి పూట కాళ్లకు సాక్సులు ధరించి నిద్రపోతే రక్త సరఫరా పెరుగుతుందట. అలాగే రక్త నాళాలు కూడా వదులవుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే నిద్ర కూడా పడుతుందట. మరి సాక్సులను ధరించడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.

తిమ్మిర్లు – నొప్పులు తగ్గుతాయి:

పగటి పూట కంటే రాత్రుళ్లు పాదాలకు సాక్సులు ధరిస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు నిపుణులు. పాదాల తిమ్మిర్లు, వాపులు, పాదాల్లో నొప్పులు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట.

ఇవి కూడా చదవండి

రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది:

రాత్రి కాళ్లకు సాక్సులు ధరించి పడుకుంటే బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరుగుతుందట. రక్త నాళాలు కూడా వదులవుతాయి.

పొడి బారవు:

పాదాలకు సాక్సులు ధరించి పడుకుంటే.. పొడి బారకుండా ఉంటాయి. అలాగే ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

సాక్సులు ధరించడం వల్ల స్త్రీలకు మంచి ఫలితాలు:

రాత్రి సాక్సులు ధరించి నిద్ర పోవడం వల్ల ముఖ్యంగా స్త్రీలకు మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మోనోపాజ్ దశలో ఉండే మహిళలు సాక్స్ ధరిస్తే.. పాదాల్లో వచ్చే మంటలు, పాదాల నుండి ఆవిర్లు రావడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

నిద్ర లేమి సమస్యలు తగ్గుతాయి:

చాలా మందికి రాత్రుళ్లు నిద్ర సరిగ్గా పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు నిద్రపోయేటప్పుడు కాటన్ సాక్స్ ధరిస్తే పాదాల్లో ఉండే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీంతో నిద్రకు ఆటంకం కలగదు.

పాదాలు చల్లగా ఉన్నా సాక్సులు ధరించవచ్చు:

కొంత మందికి పాదాలు చల్లగా ఉంటాయి. ఇలాంటి వారు సాక్సులు ధరించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. నిద్ర కూడా బాగా పడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి