AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనం చేశాక స్నానం ఎందుకు చెయ్యకూడదో తెలుసా..? దీని వెనుక అసలు రహస్యం ఇదే..

శరీరం చురుగ్గా ఉండాలంటే పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవడం అవసరం. తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే సులువుగా జీర్ణం అవుతుంది. అందుకే కడపు నిండుగా కాకుండా 50 నుంచి 60 శాతం మాత్రమే నిండేలా ఆహారం తీసుకోవాలి. ఇలా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్న తర్వాత కాసేపు వాకింగ్‌ చేస్తే జీర్ణ క్రియ చక్కగా పనిచేస్తుంది. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన..

భోజనం చేశాక స్నానం ఎందుకు చెయ్యకూడదో తెలుసా..? దీని వెనుక అసలు రహస్యం ఇదే..
Never Do These Things After Meal
Srilakshmi C
|

Updated on: Sep 08, 2023 | 3:06 PM

Share

శరీరం చురుగ్గా ఉండాలంటే పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవడం అవసరం. తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే సులువుగా జీర్ణం అవుతుంది. అందుకే కడపు నిండుగా కాకుండా 50 నుంచి 60 శాతం మాత్రమే నిండేలా ఆహారం తీసుకోవాలి. ఇలా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్న తర్వాత కాసేపు వాకింగ్‌ చేస్తే జీర్ణ క్రియ చక్కగా పనిచేస్తుంది. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. సమతుల్య ఆహారంతోపాటు క్రమమైన వ్యవధిలో భోజనం చేయడం కూడా చాలా అవసరం. అంటే చాలా మంది భోజనం సక్రమమైన పద్ధతిలో తీసుకోరు. తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవేంటో పోషకాహార నిపుణునురాలు డా. మిక్కీ మెహతా మాటల్లో తెలుసుకుందాం..

  • రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. కానీ భోజనం సమయంలో మాత్రం తక్కువ మొత్తంలోనే ద్రవాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది జీర్ణ రసాలను పలుచన చేస్తుంది. అలాగే భోజనం చేసిన వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణ రసాల సక్రమ పనితీరుకు ఆటంకం ఏర్పడి ఆహారం విషతుల్యం అవుతుంది. ఫలితంగా ఆహారం చాలా కాలం పాటు జీర్ణం కాకుండా ఉంటుంది. దీంతో కడుపులో విషపదార్ధాలు పేరుకుపోతాయి. భోజనం చేసిన తర్వాత కనీసం రెండు గంటల పాటు నీళ్లు తాగకపోవడమే మంచిది. అలాగే టీ, కాఫీలు కూడా తగకూడదు. ఎక్కువ నీళ్లు తీసుకుంటే జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. భోజనం తర్వాత వేడి పానీయాలు ఆహారాన్ని జీర్ణం చేస్తుందని, ప్రేగులను శుభ్రపరుస్తాయని చాలా మంది నమ్ముతారు. కానీ భోజనం తర్వాత వెంటనే నీళ్లు తాగితే అది మరింత హానికరంగా మారుతుంది.
  • భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల జీర్ణక్రియ చాలా క్లిష్టంగా మారుతుంది. ఒక్కోసారి అది మనకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
  • అర్థరాత్రి తినడం మానుకోవాలి. పడుకునే ముందు కనీసం రెండు లేదా మూడు గంటల ముందు తినాలి. రాత్రిపూట భారీ భోజనం లేదా అల్పాహారం కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అజీర్ణం, బరువు పెరగడానికి కారణమవుతుంది. నిద్రించడానికి కొన్ని గంటల ముందు తేలికపాటి భోజనం చేయడం మంచిది.
  • తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. అందుకే తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా తేలికపాటి పనులు చేయడం ఉత్తమం.
  • రాత్రి భోజనం తర్వాత నడవడానికి కనీసం 30 నిమిషాల నుంచి గంట వరకు సమయం తీసుకోండి. ఇది మీ శరీరం జీర్ణక్రియ ప్రక్రియలను పెంచడానికి, యాసిడ్ రిఫ్లక్స్‌ను నిరోధించడానికి సహాయపడుతుంది. తిన్న తర్వాత బరువుగా లేదా అసౌకర్యంగా అనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత నడకకు వెళ్లడం మంచింది. భోజనం చేసిన వెంటనే అధిక వ్యాయామం చేయడం కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
  • భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం జీర్ణక్రియకు చాలా హానికరం. భోజనం, స్నానానికి మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.