Diabetes: మూత్రంలో ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తున్నాయా.. షుగర్ వ్యాధి ఉందో లేదో పరీక్ష తప్పనిసరి..

శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు లేదా అవసరానికి అనుగుణంగా తగినంత షుగర్ ఉత్పత్తి కానప్పుడు చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల మధుమేహం వస్తుంది. ఈ వ్యాధికి మందు లేదు. దీనిని నియంత్రించవచ్చు. అయితే చాలా మందికి మధుమేహం లక్షణాలు ఎలా ఉంటాయో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధి శరీరంలో పెరుగుతూనే ఉంటుంది.. క్రమంగా తీవ్రతరం అయి ఆందోళన కరంగా మారుతుంది. కనుక ఈ షుగర్ లక్షణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Diabetes: మూత్రంలో ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తున్నాయా.. షుగర్ వ్యాధి ఉందో లేదో  పరీక్ష తప్పనిసరి..
Diabetes Symptoms
Follow us
Surya Kala

|

Updated on: Sep 08, 2023 | 2:54 PM

దేశంలో మధుమేహం మహమ్మారిలా విస్తరిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలను కూడా బలిపశువులను చేస్తోంది. మారిన  ఆహారపు అలవాట్లు,  మారిన జీవనశైలి కారణంగా మధుమేహ బాధితులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. మధుమేహం శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. ఈ ఒక్క వ్యాధి అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు లేదా అవసరానికి అనుగుణంగా తగినంత షుగర్ ఉత్పత్తి కానప్పుడు చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల మధుమేహం వస్తుంది. ఈ వ్యాధికి మందు లేదు. దీనిని నియంత్రించవచ్చు. అయితే చాలా మందికి మధుమేహం లక్షణాలు ఎలా ఉంటాయో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధి శరీరంలో పెరుగుతూనే ఉంటుంది.. క్రమంగా తీవ్రతరం అయి ఆందోళన కరంగా మారుతుంది. కనుక ఈ షుగర్ లక్షణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మూత్రంలోని కొన్ని లక్షణాల ద్వారా మధుమేహం ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు.

శరీరంలో షుగర్ స్థాయి ఎక్కువ కాలం ఉంటే అది మధుమేహానికి కారణమవుతుందని ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ అంకిత్ కుమార్ వివరిస్తున్నారు. ఈ షుగర్ లక్షణాలను మూత్రం ద్వారా కూడా గుర్తించవచ్చు. మధుమేహం ఉన్నట్లు అయితే మూత్రంలో ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తాయి.

తరచుగా మూత్ర విసర్జన: ఎవరైనా సరే ఎక్కువ నీరు త్రాగకపోయినా తరచుగా మూత్రవిసర్జన చేస్తూ ఉంటే అది మధుమేహ లక్షణం. కొంతమందికి రాత్రిపూట చాలాసార్లు మూత్రం పోసే అలవాటు ఉంటుంది. ఇది మధుమేహానికి సంకేతం కావచ్చు. కనుక ఈ లక్షణం కనిపిస్తే నెగ్లెక్ట్ చేయవద్దు.

దుర్వాసనతో కూడిన మూత్రం: మూత్ర విసర్జన సమయంలో మీ మూత్రం దుర్వాసన వస్తున్నా.. ప్రతిరోజూ జరుగుతున్నా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని సంకేతమని అర్థం చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో వెంటనే మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోవాలి. అన్నింటిలో మొదటిది వెంటనే షుగర్ లెవెల్ ను పరీక్ష చేయించుకోవాలి.

రంగు మారిన మూత్రం : మీకు మధుమేహం ఉంటే.. అది నేరుగా మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు శరీరంలో ప్రోటీన్ శాతం పెరుగుతుంది. దీని కారణంగా మూత్రం రంగు మారడం ప్రారంభమవుతుంది. మూత్రం రంగు లేత గోధుమ రంగులో ఉంటే.. ఈ సమస్య ఒక వారం పాటు కొనసాగితే, ఈ లక్షణాలుంటే అది మధుమేహం రానుందనే సంకేతం కావచ్చు.

మూత్రంలో నురుగు వస్తుంటే: మూత్ర విసర్జన సమయంలో ఎక్కువ నురుగు వస్తే అది శరీరంలో ప్రోటీన్ పరిమాణం పెరుగుతుందనడానికి సంకేతం.. ఇది మూత్రపిండాలపై మధుమేహం ప్రభావం సూచిస్తుందని హెచ్చరిక. అయితే ప్రతి సందర్భంలో మూత్రంలో వచ్చే నురుగు మధుమేహానికి సంకేతం కాదు. అయినా నురుగు వస్తే షుగర్ లక్షణాలున్నాయేమో అని ఒకసారి పరీక్షించుకోవాలి.

ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే.. 

ఆహారం పట్ల శ్రద్ధ వహించండి

రోజువారీ వ్యాయామం చేయాలి

మానసిక ఒత్తిడికి గురికావద్దు

తరచుగా చక్కెర స్థాయిని తనిఖీ చేస్తూ ఉండాలి

రాత్రి ఆలస్యంగా నిద్రపోవద్దు

బరువును అదుపులో ఉంచుకోండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇందులో పేర్కొన్న వివరాలు ఆరోగ్య నిపుణులు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏదైనా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.