Healthy Drinks: ఉదయం కాఫీ, టీ ఎప్పుడు తాగాలి? పరగడుపున ఏం తాగితే బెటర్!

ఉదయం ముందుగా టీ గానీ, కాఫీ గానీ పడకపోతే కొందరికి ఎలాంటి పనులూ స్టార్ట్ కావు. మరికొందరు బెడ్ కాఫీ, టీ తాగుతారు. రోజూ ఉదయం టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్న వాళ్లు.. అవి తాగకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతారు. కనీసం మౌత్ వాష్ కూడా చేసుకోరు. నీళ్లు కూడా తాగరు. ఉదయాన్నే నోరు కూడా వాష్ చేసుకోకుండా టీ, కాఫీలు తాగితే నోటిలోని క్రిములన్నీ లోపలికి వెళ్లి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. లేవగానే వేడి వేడి టీ లేదా కాఫీ తాగితే కడుపులో యాడిస్ ఉత్పత్తి పెరుగుతుందట. అలాగే రక్తంలో చక్కెర్ స్థాయి కూడా పెరుగుతుంది. కాబట్టి ఉదయం లేవగానే మౌత్ వాష్ చేసుకుని..

Healthy Drinks: ఉదయం కాఫీ, టీ ఎప్పుడు తాగాలి? పరగడుపున ఏం తాగితే బెటర్!
Weight Loss
Follow us
Chinni Enni

|

Updated on: Sep 08, 2023 | 2:57 PM

ఉదయం ముందుగా టీ గానీ, కాఫీ గానీ పడకపోతే కొందరికి ఎలాంటి పనులూ స్టార్ట్ కావు. మరికొందరు బెడ్ కాఫీ, టీ తాగుతారు. రోజూ ఉదయం టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్న వాళ్లు.. అవి తాగకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతారు. కనీసం మౌత్ వాష్ కూడా చేసుకోరు. నీళ్లు కూడా తాగరు. ఉదయాన్నే నోరు కూడా వాష్ చేసుకోకుండా టీ, కాఫీలు తాగితే నోటిలోని క్రిములన్నీ లోపలికి వెళ్లి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. లేవగానే వేడి వేడి టీ లేదా కాఫీ తాగితే కడుపులో యాడిస్ ఉత్పత్తి పెరుగుతుందట. అలాగే రక్తంలో చక్కెర్ స్థాయి కూడా పెరుగుతుంది. కాబట్టి ఉదయం లేవగానే మౌత్ వాష్ చేసుకుని, నీళ్లు తాగాలి. ఆ తర్వాతే ఏదైనా ఆహారం, పానీయాలు తాగాలని చెబుతున్నారు నిపుణులు.

అలాగే ఉదయం కాఫీ, టీలు కాకుండా హెల్దీ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మధుమేహం, బీపీ, అధిక బరువు, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు సహాయ పడతాయట. అలాగే రోజంతా హెల్దీగా, యాక్టీవ్ గా ఉంటారట. మరి ఆ హెల్దీ డ్రింక్స్ ఏంటి? టీ, కాఫీలు ఎప్పుడు తాగాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

మిరియాలు-పసుపు వాటర్:

ఇవి కూడా చదవండి

ఖాళీ కడుపుతో మిరియాలు, పసుపు వాటర్ తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. గోరు వెచ్చటి వాటర్ లో చిటికెడు పసుపు, రెండు చిటికెళ్ల నల్ల మిరియాల పొడి వేసి బాగా కలపాలి. కావాలంటే కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారైన డ్రింక్ ని.. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే జీవక్రియను మెరుగు పరచడమే కాకుండా.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

గోరు వెచ్చటి నీళ్లు:

ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ కంటే గోరు వెచ్చటి నీళ్లు తాగితే ఇంకా మంచిదంటున్నారు నిపుణులు. శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఫేస్ కూడా గ్లో అవుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది.

సోంపు-వాము-జీరా వాటర్:

సోము, వాము, జీరా వాటర్ కూడా ఉదయాన్నే తాగితే పొట్ట క్లీన్ గా ఉంటుంది. జీవక్రియను మెరుగు పరిచి.. బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. నెలసరి సమస్యలతో బాధపడే వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు కూడా పరిష్కారం లభిస్తుంది. రెండు గ్లాస్ ల నీటిలో చిటికెడు జీలకర్ర, వాము, సోంపు వేసి పది నిమిషాలు చిన్న మంట మీద మరిగించాలి. ఇలా మరిగిన నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి