Super Drinks for Health: మీరు వ్యాయామాలు చేస్తున్నారా.. అయితే ఈ డ్రింక్స్ తాగండి.. మరిన్ని బెనిఫిట్స్ పొందండి!

యోగా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పురాతన కాలం నుంచి యోగా ఫేమస్. అనేక అనారోగ్య సమస్యలకైనా, దీర్ఘకాలిక వ్యాధులకైనా యోగాతో చెక్ పెట్టవచ్చు. యోగాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నిత్యం యోగా చేస్తే మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. అధిక బరువు, డయాబెటీస్, బీపీతో పాటు శరీరంలోని కొవ్వును కూడా కరిగించేస్తుంది యోగా. అనేక కారణాల వల్ల ఒత్తిడి, ఆందోళన కలుగుతూ ఉంటాయి. యోగా చేస్తే ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చు. యోగా చేసే […]

Super Drinks for Health: మీరు వ్యాయామాలు చేస్తున్నారా.. అయితే ఈ డ్రింక్స్ తాగండి.. మరిన్ని బెనిఫిట్స్ పొందండి!
Super Health Drinks
Follow us
Chinni Enni

|

Updated on: Sep 07, 2023 | 10:08 PM

యోగా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పురాతన కాలం నుంచి యోగా ఫేమస్. అనేక అనారోగ్య సమస్యలకైనా, దీర్ఘకాలిక వ్యాధులకైనా యోగాతో చెక్ పెట్టవచ్చు. యోగాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నిత్యం యోగా చేస్తే మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. అధిక బరువు, డయాబెటీస్, బీపీతో పాటు శరీరంలోని కొవ్వును కూడా కరిగించేస్తుంది యోగా. అనేక కారణాల వల్ల ఒత్తిడి, ఆందోళన కలుగుతూ ఉంటాయి. యోగా చేస్తే ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చు. యోగా చేసే వాళ్లు.. ఆహార నియమాలు కూడా పాటిస్తే మరిన్ని బెనిఫిట్స్ మన సొంతం అవుతాయి. మరి అవేంటి? ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

గోల్డెన్ మిల్క్:

గోల్డెన్ మిల్క్ అంటే ఏంటో అనుకునేరు. ఈ మిల్క్ తయారు చేయడానికి గ్లాస్ పాలల్లో ఓ టీ స్పూన్ పసుపు వేసి బాగా మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ పాలల్లో తేనె కలుపుకుని తాగడమే. ఇదే గోల్డెన్ మిల్క్. ఇది తాగితే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే అలర్జీలకు కూడా చెక్ పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నీళ్లు:

కొబ్బరి నీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. కోకోనెట్ వాటర్ శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే హైడ్రేట్ చేస్తుంది. ఈ నీళ్లలో మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటివి ఉంటాయి.

అల్లం టీ:

వ్యాయామం చేసిన తర్వాత అల్లం టీ తాగితే రీ ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే జీర్ణక్రియను బాగా పెంచుతుంది. ఓ రెండు గ్లాస్ ల వాటర్ లో చిన్న అల్లం ముక్క వేసి ఐదు నిమిషాలు బాగా మరిగించాలి. ఈ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకుని తాగితే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

ఉసిరి రసం:

ఉసిరి కాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫాస్ట్ గా ఇమ్యూనిటీని పెంచుతుంది. ఉసిరి రసాన్ని ఎలా చేయాలంటే.. ఉసిరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి.. మిక్సీలో వేసుకుని జ్యూస్ లా చేసుకోవాలి. దీనిలో కొంచెం తేనే కలుపుకుని సేవిస్తే మంచిది. కేవలం వ్యాయామాలు చేసేవారే కాకుండా.. రోజూ ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలను దరి చేరనివ్వదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి