Lemon For Skin: ముఖానికి డైరెక్ట్ గా నిమ్మరసం వాడుతున్నారా.. అయితే ఈ టీప్స్ మీకోసమే!

నిమ్మకాయ అందాన్ని పెంచడంలో అద్భుతంగా పని చేస్తుంది. కానీ సరైన విధంగా వాడితే ఎలాంటి సమస్యలు రావు. ఇందులో బ్లీచింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే నేరుగా స్కిన్ పై రాయకూడదు. వేరే పదార్థాలతో రాయవచ్చు కానీ.. డైరెక్ట్ గా మాత్రం అస్సలు అప్లై చేయకూడదు. నేరుగా రాస్తే చర్మంపై దురదలు, దద్దర్లు, స్కిన్ అలర్జీ, నలుపు వంటి సమస్యలను ఎదుర్కొన వలసి ఉంటుంది. కొంత మంది తెలీక నేరుగా వాడి లేని పోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. నిమ్మ రసాన్ని ఎప్పుడూ కొన్ని పదార్థాలతో మాత్రమే కలిపి రాయాలి. నిమ్మ కాయను డైరెక్ట్ గా చర్మంపై రాస్తే వడదెబ్బ ప్రభావం ఎక్కువగా తగులుతుంది. దీంతో..

Lemon For Skin: ముఖానికి డైరెక్ట్ గా నిమ్మరసం వాడుతున్నారా.. అయితే ఈ టీప్స్ మీకోసమే!
Lemon
Follow us

|

Updated on: Sep 07, 2023 | 11:00 PM

చర్మాన్ని మెరిపించడంలో నిమ్మకాయ బాగా పని చేస్తుంది. స్కిన్ గ్లోతో పాటు చర్మ సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. అయితే నిమ్మకాయని ఎలా వాడలో తెలీక చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. డైరెక్ట్ గా ఫేస్ కి నిమ్మకాయని వాడతారు. దీంతో లేని పోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇది చాలా పెద్ద తప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా సరే నిమ్మరసాన్ని కానీ.. నిమ్మకాయని కానీ నేరుగా ముఖానికి వాడకూడదు. మరి నిమ్మ కాయతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నేరుగా అస్సలు రాయకూడదు:

నిమ్మకాయ అందాన్ని పెంచడంలో అద్భుతంగా పని చేస్తుంది. కానీ సరైన విధంగా వాడితే ఎలాంటి సమస్యలు రావు. ఇందులో బ్లీచింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే నేరుగా స్కిన్ పై రాయకూడదు. వేరే పదార్థాలతో రాయవచ్చు కానీ.. డైరెక్ట్ గా మాత్రం అస్సలు అప్లై చేయకూడదు. నేరుగా రాస్తే చర్మంపై దురదలు, దద్దర్లు, స్కిన్ అలర్జీ, నలుపు వంటి సమస్యలను ఎదుర్కొన వలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కొంత మంది తెలీక నేరుగా వాడి లేని పోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. నిమ్మ రసాన్ని ఎప్పుడూ కొన్ని పదార్థాలతో మాత్రమే కలిపి రాయాలి. నిమ్మ కాయను డైరెక్ట్ గా చర్మంపై రాస్తే వడదెబ్బ ప్రభావం ఎక్కువగా తగులుతుంది. దీంతో ముఖంపై కమిలి, ఎర్రగా మారుతుంది.

వీటితో కలిపి రాయవచ్చు:

నిమ్మ రసాన్ని వేరే వాటితో కాంబినేషన్ గా కలిపి ఉపయోగించవచ్చు. తేనె, పెరుగు, గంధం, శనగ పిండి, బియ్యం పిండి ఇలాంటి వాటితో కలిపి రాయవచ్చు. దీంతో చర్మ సమస్యలు రావు. అలాగే నిమ్మ రసాన్ని చర్మానికి, ముఖానికి ఉపయోగించేటప్పుడు ఎక్కువగా మోతాదులో తీసుకోకూడదు. మూడు, నాలుగు చుక్కుల నిమ్మ రసం అయితే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు పాటించాలి:

కాగా నిమ్మకాయతో చాలా రకాలైన బ్యూటీ టిప్స్ ఉంటాయి. వాటిలో ఏది మీ ముఖానికి సూట్ అవుతుందో వాటినే ఎంచుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల పదార్థాలు కొన్ని రకాల చర్మాలకు పడవు. దీంతో ఎలర్జీ, దురద, నలుపుగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీంతో వైద్యుల వద్దకు పరిగెట్టాల్సి వస్తోంది. కాబట్టి మీకు తెలిసిన బ్యూటీషియన్స్ సలహాలు తీసుకోవడం కూడా ఉత్తమమే. నిమ్మ రసాన్ని వాడేటప్పుడు ఎప్పుడైనా జాగ్రత్తలు అవసరం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి