Trans Fats: బిస్కెట్లు, కేకుల్లో గుండె ఆరోగ్యానికి హాని తలపెట్టే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయని మీకు తెలుసా?

గుండెకు ముప్పు తలపెట్టే ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? ముఖ్యంగా పిజ్జాలు, కాఫీ క్రీమ్‌, మఫిన్‌, మైక్రోవేవ్ పాప్‌కార్న్, బిస్కెట్లు, స్ప్రెడ్‌, డిప్స్‌లలో ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన దేశంలో తలెత్తే కరోనరీ హార్ట్ డిసీజ్ మరణాలలో 4.6 శాతం ట్రాన్స్-ఫ్యాటీ యాసిడ్స్‌కు సంబంధించినవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)వెల్లడించింది. అని కనుగొన్నందున ఇది మన ఆరోగ్యానికి ముప్పు..

Trans Fats: బిస్కెట్లు, కేకుల్లో గుండె ఆరోగ్యానికి హాని తలపెట్టే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయని మీకు తెలుసా?
Bakery Food
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 08, 2023 | 4:00 PM

గుండెకు ముప్పు తలపెట్టే ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? ముఖ్యంగా పిజ్జాలు, కాఫీ క్రీమ్‌, మఫిన్‌, మైక్రోవేవ్ పాప్‌కార్న్, బిస్కెట్లు, స్ప్రెడ్‌, డిప్స్‌లలో ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన దేశంలో తలెత్తే కరోనరీ హార్ట్ డిసీజ్ మరణాలలో 4.6 శాతం ట్రాన్స్-ఫ్యాటీ యాసిడ్స్‌కు సంబంధించినవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)వెల్లడించింది. అని కనుగొన్నందున ఇది మన ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. ట్రాన్స్-ఫ్యాట్ తీసుకోవడం వల్ల శరీరం మొత్తం శక్తిలో ఒక శాతం కంటే తక్కువ మాత్రమే వినియోగించేలా చేస్తుందట. ఉదాహరణకు 2 వేల కేలరీల ఆహారంలో రోజుకు 2.2 గ్రాముల కంటే తక్కువ శక్తి మాత్రమే వినియోగించబడతాయి. ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్, ఆర్థరైటిస్ లేదా ఇతర జీవక్రియ రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం కేవలం రెండు శాతం తగ్గించడం వల్ల ప్రాణాంతకమైన గుండెపోటు ముప్పు 30 శాతం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అసలింతకీ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏమిటి?

ట్రాన్స్-కొవ్వులు అసంతృప్త కొవ్వులకు చెందిన ఒక రూపం. ఇవి సహజ, సింథటిక్ రూపాల్లో లభిస్తాయి. సహజ ట్రాన్స్ ఫ్యాట్స్ పాలు, వెన్న, చీజ్, మాంసంలలో ఉంటాయి. అదే కృత్రిమ ట్రాన్స్ కొవ్వులు వనస్పతి, ప్యాక్ చేసిన స్నాక్స్ లలో ఉంటాయి.

కృత్రిమ ట్రాన్స్-కొవ్వులను పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన ట్రాన్స్-ఫ్యాట్స్, పాక్షికంగా హైడ్రోజనేటెడ్ కొవ్వులు అని కూడా పిలుస్తారు. ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి వీటిల్లో ఉపయోగిస్తారు. వెన్నకి ప్రత్యామ్నాయంగా 20వ శతాబ్దం ప్రారంభం నుంచి వీటిని అధికంగా ఉపయోగిస్తున్నారు. వనస్పతి రూపంలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్‌లో ట్రాన్స్ ఫ్యాట్ అత్యధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో తెలిసింది. స్థానిక సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసే ప్రతి వస్తువులో కృత్రిమ ట్రాన్స్-కొవ్వులు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఇక కేకులు, కుకీలు, పైస్, షార్ట్నింగ్, మైక్రోవేవ్ పాప్‌కార్న్, రిఫ్రిజిరేటెడ్ డౌ, బిస్కెట్లు, డోనట్స్, నాన్-డైరీ కాఫీ క్రీమర్, స్టిక్ వనస్పతి, వేయించిన ఆహారాలు, డోనట్స్, పేస్ట్రీలు, ఐస్ క్రీం, బ్రెడ్ వంటి అనేక ఆహార ఉత్పత్తుల్లోను ఇవి కనిపిస్తాయి. ప్యాక్ చేయని ఆహారాలకు లేబుల్ ఉండవు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇలా ప్యాక్‌ చేయని ఆహారాల్లో మరెంత ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుందో మీరే ఊహించండి.

పాలు, వెన్, జున్ను వంటి సహజమైన ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎటువంటి హాని తలపెట్టవు. పాల ఉత్పత్తుల్లో 2-6 శాతం, గొడ్డు మాంసం, గొర్రె మాంసంలో 3-9 శాతం ఈ కొవ్వులు ఉంటాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!