AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandyala: రూ.500 నోట్లకు రూ.2 వేల నోట్లు.. 15 శాతం కమీషన్‌ ఇస్తామంటూ బడా మోసం..

మా దగ్గర బ్లాక్ మనీలో రెండు వేల నోట్లు కోట్ల రూపాయలు ఉన్నాయి. కోటి రూపాయల ఐదు వందల నోట్లు ఇస్తే... కోటి పదహైదు లక్షలు రెండు వేల నోట్లు ఇస్తాం.మీరు ఎన్ని కోట్లు ఇస్తే, అన్ని కోట్ల రెండు వేల నోట్లు ఇస్తాం ఇది మార్కెట్లో కొత్త తరహా మోసం. ఇలాంటి మాటలు నమ్మిన నంద్యాలకు చెందిన వ్యక్తి..

Nandyala: రూ.500 నోట్లకు రూ.2 వేల నోట్లు.. 15 శాతం కమీషన్‌ ఇస్తామంటూ బడా మోసం..
Nandyala Gang Cheating People
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Sep 08, 2023 | 10:09 AM

Share

నంద్యాల, సెప్టెంబర్ 8: మా దగ్గర బ్లాక్ మనీలో రెండు వేల నోట్లు కోట్ల రూపాయలు ఉన్నాయి. కోటి రూపాయల ఐదు వందల నోట్లు ఇస్తే… కోటి పదహైదు లక్షలు రెండు వేల నోట్లు ఇస్తాం.మీరు ఎన్ని కోట్లు ఇస్తే, అన్ని కోట్ల రెండు వేల నోట్లు ఇస్తాం ఇది మార్కెట్లో కొత్త తరహా మోసం. ఇలాంటి మాటలు నమ్మిన నంద్యాలకు చెందిన వ్యక్తి నుంచి రూ.2.20 కోట్ల ఐదు వందల నోట్లను దోచుకున్న ముఠాను పోలిసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.70 లక్షల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించారు.

నంద్యాల పట్టణానికి చెందిన శ్రీనివాస రెడ్డి రియల్ ఎస్టేట్ తోపాటు ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటు జీవనం సాగిస్తూ ఉంటాడు.అతనికి తెలిసిన వ్యక్తి ద్వారా వైజాక్ చెందిన కొందరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. మా దగ్గర రెండు వేల నోట్లు ఉన్నాయి ప్రస్తుతం బ్యాంక్ లలో మార్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది.మీరు కోటి రూపాయల ఐదు వందల నోట్లు ఇస్తే కోటి పదహైదు లక్షల రెండు వేల నోట్లు ఇస్తాం అని ఆశ చూపారు.ఆశ పడిన బాదితుడు తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు మరి కొంత మందిని భాగస్వాముల దగ్గర నుంచి రూ.2.20 కోట్ల రూపాయలు ప్రోగు చేసాడు.

బాదితుడు శ్రీనివాస రెడ్డిని డబ్బులు తీసుకొని పట్టణ శివారులోని రైతునగర్ రావాలని ముఠ సభ్యలు సూచించారు.బాదితుడు డబ్బులు తీసుకొని ముఠా సభ్యలు చెప్పిన ప్రదేశంకు వెళ్ళాడు.బాదితుడు డబ్బులు బ్యాగ్ చూపించగానే పోలీస్ సైరన్ తో ఒక వైహికిల్ రావడంతో బాదితుడు దగ్గర ఉన్న డబ్బుల బ్యాగ్ తో ముఠా సభ్యులు పరార్ అయ్యారు. ఇది అంతా మోసం అని గ్రహించిన బాదితుడు పోలిసులకు ఫిర్యాదు చేసాడు. బాదితుడు ఫిర్యాదు మేరకు ముఠా కోసం ప్రత్యేక బృందాలతో గాలించారు.ముఠా సభ్యులు వచ్చిన వైహికిల్ నెంబర్ల ద్వారా ముద్దాయిల గుర్తించారు.

ఇవి కూడా చదవండి

వైజాక్ చెందిన శోభన్ బాబు,చిన్న బాబు అనే ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీయస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు.ఈ కేసు సంబందించి ఇంకా ఆరుగురు పరారిలో ఉన్నారని వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తూన్నామని తెలిపారు. ఈ ముఠాలోని సభ్యులు వైజాక్ తదితర ప్రదేశ్లో ఇలాంటి మోసాలే‌ పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us