Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అక్కడ నయా దందా షురూ.. శుభకార్యం మొదలైందా.. వారికి వేలకు వేలు పన్ను కట్టాల్సిందే..

ఎవరు ఎలాంటి శుభాకార్యం చేసుకున్నా.. ఏ ఇంటి మందు ఆహ్వాన బ్యానర్ కనిపిస్తే చాలు.. వెంటనే అక్కడ ఓ గ్యాంగ్ ప్రత్యక్షం అయిపోతుంది. అక్కడికి వెళ్లి నానా హంగామా చేసి.. ఆ కుటుంబ సభ్యుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తారు. విజయవాడలో ఒక ప్రముఖ షోరూమ్ ఓపెనింగ్ జరిగితే.. సినీ నటుడు బాలకృష్ణ.. ఆ షోరూమ్ ను ప్రారంభించారు. అనంతరం ట్రాన్స్ జెండర్లు ఆ షోరూమ్ వద్దకు వెళ్లి యజమానులను మీ వ్యాపారం బాగుండాలంటే.. తమ ఆశీర్వాదం ఉండాల్సిందేనని.. ఐదు లక్షలు డిమాండ్ చేశారు.

Andhra Pradesh: అక్కడ నయా దందా షురూ.. శుభకార్యం మొదలైందా.. వారికి వేలకు వేలు పన్ను కట్టాల్సిందే..
Naya Danda In Vijayawada
Follow us
M Sivakumar

| Edited By: Surya Kala

Updated on: Sep 08, 2023 | 12:47 PM

విజయవాడలో ట్రాన్స్‌జెండర్ల మాఫియా ఆగడాలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయి. ఎవరైనా శుభకార్యం చేసుకున్నా..ఆహ్వానం బ్యానర్ కట్టినా వారికి పన్ను చెల్లించాల్సిందే.. వ్యాపార సంస్థల ఓపెనింగ్ అయినా.. గ్రుహ ప్రవేశాలు అయినా.. వివాహా శుభకార్యాలు చేసుకుంటున్నా.. ట్రాన్స్‌జెండర్లు అక్కడ వాలిపోతుంటారు. మా అశీర్వాదం ఉంటే మంచి జరుగుతుందని వారు కోరుకున్నంత డబ్బు డిమాండ్ చేస్తారు. తమకు అంత ఇచ్చేంత స్తోమత లేదని మొత్తుకున్నా.. వారు చేసే హడావిడికి ప్రజలు బెంబేలెత్తిపోతారు.

విజయవాడలో ట్రాన్స్‌జెండర్‌ల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. ఎవరు ఎలాంటి శుభాకార్యం చేసుకున్నా.. ఏ ఇంటి మందు ఆహ్వాన బ్యానర్ కనిపిస్తే చాలు.. వెంటనే అక్కడ ఓ గ్యాంగ్ ప్రత్యక్షం అయిపోతుంది. అక్కడికి వెళ్లి నానా హంగామా చేసి.. ఆ కుటుంబ సభ్యుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తారు. విజయవాడలో ఒక ప్రముఖ షోరూమ్ ఓపెనింగ్ జరిగితే.. సినీ నటుడు బాలకృష్ణ.. ఆ షోరూమ్ ను ప్రారంభించారు. అనంతరం ట్రాన్స్ జెండర్లు ఆ షోరూమ్ వద్దకు వెళ్లి యజమానులను మీ వ్యాపారం బాగుండాలంటే.. తమ ఆశీర్వాదం ఉండాల్సిందేనని.. ఐదు లక్షలు డిమాండ్ చేశారు. ఆ షోరూమ్ యజమాని వారికి 10 వేలు ఇచ్చినా తీసుకోకపోవడంతో.. మరో 10 వేలు ఇచ్చారు. అయినప్పటికీ.. ఆ డబ్బు తీసుకునేందుకు ట్రాన్స్ జెండర్లు నిరాకరించారు. దీంతో.. వారి యొక్క టార్చర్ తట్టుకోలేక.. బ్రతిమిలాడుకొని చివరకు రెండు లక్షల ఇరవై వేలకు ఒప్పందం కుదుర్చుకుని.. వారికి చెల్లించాడు.

ట్రాన్స్ జెండర్ల వ్యవహారం ఎలా ఉందంటూ.. వారు అడిగినంత డబ్బు ఇస్తేనేమో ఆశీర్వాదం.. ఇవ్వని పక్షంలో వారి శాపనార్ధాలు పెడుతూ హల్చల్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బెజవాడలో ట్రాన్స్ జెండర్ మాఫియా గా మారి.. వేలకు వేలు డబ్బులు దండుకుంటున్నారు. ఎక్కడైనా సరే.. ఒక చిన్నపాటి ఫంక్షన్ జరిగినా.. ఇంట్లో చిన్న వేడుక చేసుకున్నా.. ట్రాన్స్ జెండర్లకు పన్ను కట్టాల్సిందే.. పేద, మధ్య తరగతి వారు అయితే.. రూ.5 వేలు తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోరు. అదే కాస్తా డబ్బు ఉన్న ఫ్యామిలీలు అయితే.. వారికి హద్దు అనేదే లేదు. లక్షల్లో డిమాండ్ చేస్తారు.

ఇవి కూడా చదవండి

విజయవాడ నగరంలో ఎక్కడ ఏ గల్లిలో ఇల్లు కట్టుకున్నా.. వారి ఇన్ ఫార్మర్ల ద్వారా సమాచారం తెలుసుకుని.. అక్కడి వాలిపోతుంటారు. సరిగ్గా ముహూర్తం సమాయానికి ట్రాన్స్ జెండర్లు ఎంట్రీ ఇస్తారు. ఇక.. అప్పుడు మొదలవుద్ది.. ఆ ఇంటి యజమానులకు అసలైన తలనొప్పి.. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. మరోవైపు.. రోడ్లపైన సిగ్నల్స్ దగ్గర వాహనాలను అడ్డగించి.. నానా హడావిడి చేసి డబ్బులు దండుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ వీడియో చూడండి.. నూతన దంపతులు పెళ్లి చేసుకొని వారి గమ్యస్థానానికి వెళ్తుండగా బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ లో కారు ఆగింది దింతో దంపతులను చూసిన ట్రాన్ జెండర్లు డబ్బులు డిమాండ్ చేశారు.. డబ్బు ఇవ్వకపోతే.. వాహనాలకుఅడ్డంగా నిల్చుని.. వివాదాలు చేస్తున్నారు. ఇది గమనించిన Tv9 వీడియోను తీయగా వివాదానికి దిగారు.. మరోవైపు నగర ప్రజలు ట్రాన్స్ జెండర్ల పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు మాత్రం ట్రాన్స్ జెండర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో