Lord SriKrishna: దొంగిలించి తెచ్చిన కన్నయ్య విగ్రహం గుర్తుపట్టకుండా మీసాలు.. కోరిన కోర్కెలు తీర్చే కృష్ణుడి గుడి ఎక్కడుందంటే..
రాజగోపాలపేటలో ఒక పాడిపడ్డ బావిలో పూజలు అందుకుంటున్న శ్రీకృష్ణ విగ్రహాన్ని దొంగతనంగా తీసుకొచ్చారు. ఆ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్టిస్తే అందరికీ అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో తమ ఊరిలో ఉన్న కృష్ణమ్మ చెరువులో ఆ విగ్రహాన్ని భద్రంగా పదిలపరిచారు. తమ గ్రామంలో ఉన్న కృష్ణుడి విగ్రహం పోయిందని తెలియడంతో చుట్టుపక్కలంతా వెతికిన గ్రామస్తులకి ఎక్కడా కూడా విగ్రహం కనపడకపోవడంతో వెనుతిరిగారు.
వెన్న తిన్న చిన్ని కృష్ణుడు.. మట్టి తిన్నావా అని మందలించిన తన తల్లి యశోదమ్మకు తన నోటిలో సమస్త లోకాలను చూపించాడు. కురుక్షేత్రం యుద్ధంలో పాండవుల మధ్యముడు అర్జునుడికి శ్రీ కృష్ణుడు రథసారథిగా ఉండి ధర్మాన్ని గెలిపించాడు. అలాంటి కృష్ణ లీలలు మధురం.. ఆయన మాయలు కమనీయం. ఎన్ని మార్లు విన్నా రమణీయం అనిపిస్తాయి. శ్రీకృష్ణుడు ఆలయాలు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో సైతం ఉన్నాయి. దేశ విదేశాల్లోని భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అయితే ఎక్కువగా కృష్ణున్ని, తాండవ కృష్ణుడి గాను, వెన్నతిన్న కృష్ణుడిగా ఉన్న విగ్రహాలతో పూజలను అందుకుంటున్నాడు. అయితే భక్తులతో పూజలను అందుకుంటున్న మీసాలతో ఉన్న కృష్ణుడిని ఎప్పుడైనా చూశారా..? ఈ మీసాల కృష్ణుడిని చూడాలంటే సిద్దిపేట జిల్లాకు వెళ్లాల్సిందే.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో చెళ్లపుర్ లో గల గుడిలో పెద్దపెద్ద కోర మీసాలతో గోపాలకృష్ణులు కనిపిస్తాడు. కృష్ణుడేంటి మీసాలతో ఉండటం ఏంటి అని ఎవరికైనా ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఈ మీసాల కృష్ణుడే ఇక్కడ వారికి ప్రత్యేకం దాదాపు 200 సంవత్సరాల క్రితం లో ఈ ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించకుండా వదిలేశారు. ఇంత అద్భుతంగా గుడి నిర్మాణం చేసి గుడిలో దేవుడిని ప్రతిష్టించకపోవడంతో ఆ గ్రామ ప్రజలు ఎలాగైనా గుడిలో దేవుడిని ప్రతిష్టింపచేయాలని భావించారు.
తమ గ్రామం పక్కనే ఉన్న నంగునూరు మండలం రాజగోపాలపేటలో ఒక పాడిపడ్డ బావిలో పూజలు అందుకుంటున్న శ్రీకృష్ణ విగ్రహాన్ని దొంగతనంగా తీసుకొచ్చారు. ఆ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్టిస్తే అందరికీ అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో తమ ఊరిలో ఉన్న కృష్ణమ్మ చెరువులో ఆ విగ్రహాన్ని భద్రంగా పదిలపరిచారు. తమ గ్రామంలో ఉన్న కృష్ణుడి విగ్రహం పోయిందని తెలియడంతో చుట్టుపక్కలంతా వెతికిన గ్రామస్తులకి ఎక్కడా కూడా విగ్రహం కనపడకపోవడంతో వెనుతిరిగారు.
విగ్రహాన్ని ప్రతిష్టిస్తే ఎప్పటికైనా ఇది తమదేనా అని గుర్తు పడతారని గ్రామస్తులంతా కలిసి కృష్ణుని విగ్రహానికి కొప్పును తీసేసి కృష్ణుడికి కోర మీసాలు పెట్టి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుండి ఈ గుడిని కోరమీసాల వేణుగోపాలస్వామి ఆలయంగా పిలవడం జరుగుతుంది. విగ్రహం ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి ఈ గుడిలో ఏర్పాటు చేసిన నంది దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉండడం ఒక ప్రత్యేకత. అయితే ఈ గుడి ముందున్న కోనేరులో ఎంత తీవ్ర కరువు వచ్చినా ఎంత ఎండ వచ్చినా నీటిమట్టం తగ్గలేదు. ఇప్పటి వరకూ తాము కోనేరులో నీరు ఎండిపోయినట్టుగా ఎక్కడా కూడా దాఖలాలు లేవని గ్రామస్తులు చెప్తున్నారు.
ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో ఈ మీసాల కృష్ణుడికి పూజాకైంకర్యాలు నిర్వహిస్తున్నామని ఈ ప్రాంతం భక్తులకు కొంగుబంగారంగా వెలిసిందని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ కృష్ణుడి. ఈ స్వామి కొలువై ఉన్నాడని ఆ గ్రామ ప్రజలు ఎంతో భక్తి భావంతో తెలియపరిచారు.. దాదాపు 200 సంవత్సరాల నాటి గుడి గుడి అత్యంత పురాతనమైనది..ఆలయ మరమ్మత్తుల కోసం ప్రభుత్వం చొరవ చూపి ఇంతటి ప్రశస్తి గల దేవాలయాన్ని పట్టించుకోవాలని కోరుతున్నారు. గుడిలో స్వామివారికి ప్రభుత్వం ఇచ్చే అని ధూప దీప నైవేద్య పథకంలో తమ గుడిని చేర్చాలని తద్వారా గుడి అభివృద్ధికి సహకరించాలని గుడి పూజారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..