Janmashtami: మధురలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. అర్ధరాత్రి స్వామివారిని దర్శించి అభిషేకాలు చేసిన భక్తులు

కన్నయ్య జన్మదినాన్ని పురష్కరించుకుని దేశ వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమిని జరుపుకున్నారు. శ్రీ కృష్ణుడు మధురలో జైలులో అర్ధరాత్రి జన్మించాడట కనుక బంకే బిహారీ, మధుర, బృందావనం వంటి ప్రముఖ కృష్ణుడి క్షేత్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో అర్ధరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతేకాదు ప్రతి ఇంట్లోనూ కన్నయ్యలు సందడి చేశారు.

Surya Kala

|

Updated on: Sep 08, 2023 | 11:05 AM

 శ్రీకృష్ణుడు జన్మాష్టమి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో కన్నయ్యను  దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి కృష్ణుడు భక్తులు బంకే బిహారీకి భారీగా తరలివచ్చారు.

1 / 6
జన్మాష్టమి సందర్భంగా అర్ధరాత్రి శ్రీ కృష్ణ భగవానుని ప్రతిష్ఠాపన అర్ధరాత్రి జరిగింది. శ్రీకృష్ణుడికి అభిషేకం చేశారు. ఈ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు కన్నయ్యను దర్శించుకున్నారు. జన్మాష్టమి సందర్భంగా బ్రజ్‌లో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మధుర, బృందావనం రహదారులపై ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపించింది.

2 / 6
కృష్ణాష్టమి సందర్భంగా ఉదయం నుంచి శ్రీకృష్ణుని భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నప్పటికీ.. శ్రీకృష్ణ జన్మస్థలం వద్ద అర్ధరాత్రి పట్టాభిషేక మహోత్సవానికి అపూర్వమైన రద్దీ నెలకొంది.

3 / 6
ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి కృష్ణ భక్తులు ఇక్కడికి తరలివచ్చారు. అభిషేకం చూసేందుకు యాత్రికులందరూ క్యూలైన్‌లో నిలబడి తమ వంతు వచ్చే వరకు వేచి ఉండాల్సిందిగా అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. 

4 / 6
బంకే బిహారీ ఆలయంలో రాత్రి 2 గంటలకు మంగళ హారతిని ఆలయ పూజారి జ్ఞానేంద్ర గోస్వామి ఇచ్చారు. ఈ హారతిని వేక్షించడానికి స్వామివారిని దర్శించుకోవడానికి సాయంత్రం నుంచే భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు. తమ వంతు వచ్చేవరకూ వేచి చూసి గోవర్ధనగిరిధారిని దర్శించుకున్నారు.  

5 / 6
గత ఏడాది ఏర్పడిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని  వేడుకల సందర్భంగా ఏర్పడే రద్దీ , తొక్కిసలాటను నివారించడానికి అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే వాటిని నివారించడానికి బంకే బిహారీ ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని పరిమితం చేశారు. 

6 / 6
Follow us