- Telugu News Photo Gallery Spiritual photos Saturday Vastu Tips: This work should not be done even by mistake on Saturday in telugu
Saturday Puja Tips: ఈ ఐదు పనులు శనివారం అసలు చేయవద్దు.. శనీశ్వరుడి కోపానికి గురై అనేక ఇబ్బందులు పడతారు..
హిందూ మతంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. అదేవిధంగా శనివారం భైరవుడు రోజు. ఈ శని వారం స్వభావం భయంకరంగా ఉంది. గ్రంధాల ప్రకారం శనివారం న్యాయం, కర్మల దేవుడు శనీశ్వరుడికి అంకితం చేయబడింది. శనిదేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో ఏమీ లోటు ఉండదని నమ్ముతారు. విజయం వారి పాదాల చెంతనే ఉంటుందని విశ్వాసం. అంతేకాదు అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వాసం.
Updated on: Sep 09, 2023 | 8:24 AM

నివారాలలో కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ పనులు చేయడం వల్ల జాతకంలో శనిశ్వర స్థానం బలహీనంగా మారి చేపట్టిన పనులన్నీ చెడిపోవడం మొదలవుతాయి. అదే సమయంలో శనీశ్వరుడి ఆగ్రహానికి కూడా కారణం అవుతారు. అయితే శనివారం నాడు అస్సలు చేయకూడని పనులు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం..

నూనె కొనకూడదు: జ్యోతిష్యుని ప్రకారం శనివారం పొరపాటున కూడా ఆవనూనె లేదా మరేదైనా నూనె కొనుగోలు చేయకూడదు. ఈ రోజు నూనె కొంటే ఇంట్లో దారిద్య్రం వస్తుందని నమ్ముతారు. అయితే శనివారం రోజున నూనె దానం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఆవాల నూనె, లేదా నువ్వుల నూనెను దానం చేయడంవలన శనీశ్వరుడు సంతోషపడతాడు.

జుట్టు కడగకండి: కొందరికి రోజూ తలకు స్నానం చేసే అలవాటు ఉంటుంది. అయితే పొరపాటున కూడా శనివారం జుట్టుకు తల స్నానం చేయవద్దు. ముఖ్యంగా స్త్రీలు ఈ రోజు జుట్టు కడగడం అశుభం, ఇంటిపై చెడు ప్రభావం చూపుతుందని నమ్ముతారు.

ఇనుప వస్తువులు ఇంటికి తీసుకురావద్దు: అంతే కాకుండా శనివారం నాడు ఇనుముతో చేసిన ఏ వస్తువులనైనా ఇంటికి తీసుకురాకూడదు. అలా చేయడం అశుభంగా భావిస్తారు. శనిదేవుడు ఇనుప ఆయుధాన్ని ధరిస్తాడని పురాతన గ్రంధాలలో చెప్పబడింది, అందుకే ఇనుము శనీశ్వరుడికి సంబంధించిన లోహంగా పరిగణించబడుతుంది. కనుక శనివారం రోజున ఇనుమును, ఇనుప వస్తువులను ఇంటికి తీసుకురావద్దు.

మాంసం తినకూడదు: శనివారం రోజున ఏ జంతువుకు హానీ కలిగించకూడదు. మీరు మాంసాహారులైతే ఈ రోజు పొరపాటున కూడా మాంసాన్ని తినకండి. బదులుగా మీరు పేదలకు సహాయం చేయండి. దీంతో శనీశ్వరుడు సంతోష పడతాడు.

ఇంటికి ఉప్పు తీసుకురావద్దు: శనివారం రోజున ఇంట్లోకి ఉప్పు తీసుకురాకూడదు. శనివారం నాడు ఇంట్లోకి ఉప్పు తీసుకురావడం చెడు శకునంగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం, శనివారం రోజున ఉప్పును తీసుకురావడం వల్ల ఇంట్లో అప్పులు పెరుగుతాయి. ఇంట్లోని కుటుంబ సభ్యులు అనేక వ్యాధులకు గురవుతాడు.





























