IIT Bombay: గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఐఐటీ బాంబేకి 160 కోట్ల విరాళం..ప్రొఫెసర్ ఏమి చెప్పారంటే..
భారతదేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల లిస్ట్ లో ఐఐటీ బాంబే పేరు మూడో స్థానంలో ఉంది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఐఐటీ సంస్థ కూడా ఖ్యాతిగాంచిందే.. ఈ సంస్థ పనితీరు గురించి చెప్పాలంటే.. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023-24లో IIT బాంబే 149వ ర్యాంక్‌ను పొందింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీలో అగ్రస్థానంలో ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్ ఇప్పుడు విరాళాలతో వార్తల్లో నిలిచింది.
ఐఐటీ సంస్థ అంటే ముందుగా అందరికి గుర్తుకొచ్చేది దేశ ఆర్ధిక రాజధానిలోని ముంబై ఐఐటీ సంస్థనే.. అయితే తాజాగా ఐఐటీ సంస్థకు విరాళంగా వచ్చిన మొత్తంపై మరోసారి చర్చ మొదలైంది. ఈసారి ఇన్‌స్టిట్యూట్ 1.8 మిలియన్ డాలర్ల విరాళాన్ని అందుకుంది.. అంటే భారతీయ రూపాయలలో దాదాపు 160 కోట్లు. విశేషమేమిటంటే ఈసారి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నుంచి విరాళం అందింది. ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ గుర్తు తెలియని దాత సంస్థ పూర్వ విద్యార్థి అని ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి చెప్పారు.
భారతదేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల లిస్ట్ లో ఐఐటీ బాంబే పేరు మూడో స్థానంలో ఉంది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఐఐటీ సంస్థ కూడా ఖ్యాతిగాంచిందే.. ఈ సంస్థ పనితీరు గురించి చెప్పాలంటే.. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023-24లో IIT బాంబే 149వ ర్యాంక్‌ను పొందింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీలో అగ్రస్థానంలో ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్ ఇప్పుడు విరాళాలతో వార్తల్లో నిలిచింది.
ఐఐటీ బాంబే అందుకున్న విరాళాలు
ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి మాట్లాడుతూ భారతీయ విద్యా ప్రపంచంలో ఇదొక అపూర్వమైన సంఘటన అని.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి 160 కోట్లు విరాళంగా అందించారని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ రీసెర్చ్ హబ్ ఏర్పాటు కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఐఐటీ బాంబే ప్రొఫెసర్ చౌదరి మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణంలో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు.
నందన్ నీలేకని విరాళం
ఇటీవల ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని కూడా ఐఐటీ బాంబేకి రూ.315 కోట్ల విరాళం అందించారు. నందన్ నీలేకని ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి. ఇక్కడి నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. 1973లో ఐఐటీ బాంబే నుంచి పట్టాను పుచ్చుకున్నారు.
ఐఐటీ బాంబేలో చేరి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ విరాళాన్ని అందించారు. ఈ మేరకు బెంగళూరులో డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి, నందన్ నీలేకని ఎంఓయూపై సంతకాలు చేశారు. విరాళాల్లో ఇప్పటివరకు అందిన అతి పెద్ద మొత్తం ఇదే. గతంలో నీలేకని ఐఐటీ బాంబేకు రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు నందన్ నీలేకని తాను చదువుకున్న సంస్థకు రూ. 400 కోట్లు విరాళం ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..