AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Man: షాజహాన్ స్ఫూర్తి అంటూ భార్య జ్ఞాపకార్థం ఆలయం నిర్మించి రోజూ పూజలు చేస్తున్న భర్త.. ఎక్కడంటే..

రామ్ సేవక్ రైదాస్ తన భార్య 18 మే 1961న జన్మించిందని, ఆ తర్వాత తాను 18 మే 1977న వివాహం చేసుకున్నానని చెప్పాడు. తాము జీవితాన్ని చాలా సంతోషంగా గడిపామని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అతని భార్య మరణించింది. అప్పటి నుంచి అతను ఒంటరిగా ఫీల్ అయినట్లు చెప్పాడు. ఈ ఆలయం నిర్మించి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాను తన భార్య ఉనికిని అనుభవిస్తున్నట్లు చెప్పాడు. 

UP Man: షాజహాన్ స్ఫూర్తి అంటూ భార్య జ్ఞాపకార్థం ఆలయం నిర్మించి రోజూ పూజలు చేస్తున్న భర్త.. ఎక్కడంటే..
Husband Built Temple
Surya Kala
|

Updated on: Aug 08, 2023 | 11:11 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ భర్త తన భార్య జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించాడు. విశేషమేమిటంటే ఆ ఆలయంలో ఏ దేవుడి గ్రహాన్ని ప్రతిష్టించలేదు.. తన భార్య విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఇప్పుడు తన భార్య విగ్రహానికి ఉదయం, సాయంత్రం పూజలను చేస్తున్నాడు. భార్య విగ్రహం ముందు కూర్చుని పారాయణం చేస్తున్నాడు. భార్యపై భర్తకు ఉన్న ప్రేమను చూసిన స్థానికులు షాజహాన్, ముంతాజ్ ల ప్రేమకథ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ముంతాజ్ కోసం షాజహాన్ ఎలా తాజ్ మహల్ కట్టించాడో.. అదే విధంగా తన భార్యకు గుడి కట్టించిన భర్త కూడా గొప్ప ప్రేమికుడు అని  అంటున్నారు.

జిల్లాలోని బక్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పదారా గ్రామంలో నివసిస్తున్న రామ్ సేవక్ రైదాస్ తన భార్య జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించాడు. రాంసేవక్ రైదాస్ కరోనా కాలంలో భార్య 18 మే 2020న మరణించింది. భార్య మరణించిన తరువాత.. రామసేవకులు మౌనంగా ఉండటం ప్రారంభించాడు. తన భార్య మరణంతో  చాలా కలత చెందాడు. ఈ నేపథ్యంలో తన భార్య కోసం ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు అతని భార్యకు గుడి కట్టిన తర్వాత అక్కడ పూజలు చేయడం ప్రారంభించాడు.

పొలంలో ఆలయ నిర్మాణం

రామసేవక్ రైదాస్ అమీన్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు. తన భార్య మరణించిన తరువాత కొన్ని నెలలు చాలా బాధపడ్డాడు. ఆ తరువాత అతను ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ నిర్మాణానికి తన పొలం భూమిని ఎంచుకున్నాడు. రెండంతస్తల్లో ఆలయాన్ని నిర్మించాడు, అందులో తన భార్య విగ్రహాన్ని ప్రతిష్టించాడు.  రామసేవక్ రైదాస్ దంపతులకు 5 మంది పిల్లలు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలున్నారు.

ఇవి కూడా చదవండి

1977లో పెళ్లయింది

రామ్ సేవక్ రైదాస్ తన భార్య 18 మే 1961న జన్మించిందని, ఆ తర్వాత తాను 18 మే 1977న వివాహం చేసుకున్నానని చెప్పాడు. తాము జీవితాన్ని చాలా సంతోషంగా గడిపామని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అతని భార్య మరణించింది. అప్పటి నుంచి అతను ఒంటరిగా ఫీల్ అయినట్లు చెప్పాడు. ఈ ఆలయం నిర్మించి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాను తన భార్య ఉనికిని అనుభవిస్తున్నట్లు చెప్పాడు.

ఎగతాళి చేసిన గ్రామస్తులు

మొదట్లో, రామసేవక్ భార్య కోసం ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు గ్రామస్థులు అతని నిర్ణయాన్ని స్వాగతించలేదు. కొందరు ఎగతాళి చేశారు కూడా..  అయితే గుడి కట్టిన తర్వాత భార్యపై అతడి ప్రేమ ఎంత నిజమో అందరికీ అర్థమైంది. ఆలయ నిర్మాణం తర్వాత, రామసేవక్ ఉదయం, సాయంత్రం తన భార్య ఆలయానికి వెళ్లి పూజలు చేస్తాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..