Lodia Kund: జలపాతంలో పడిన వాహనం.. కారులో చిన్నారి సహా ముగ్గురు.. ప్రాణాలకు తెగించి కాపాడిన యువకుడు..

ఇండోర్ సిమ్రోల్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం చూడటానికి పర్యాటకులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అలా అక్కడకు వచ్చిన ఓ కుటుంబ విహారయాత్రకు దంపతులు వెళ్లారు. కారుని జలపాతం దగ్గర్లో పార్క్ చేసింది. అయితే ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదు కానీ కారు రివర్స్‌ చేస్తున్నప్పుడు లేదా హ్యాండ్‌బ్రేక్‌లు వేయకపోవడంతో కొలనులో పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Lodia Kund: జలపాతంలో పడిన వాహనం.. కారులో చిన్నారి సహా ముగ్గురు.. ప్రాణాలకు తెగించి కాపాడిన యువకుడు..
Car Accident In Mp
Follow us

|

Updated on: Aug 08, 2023 | 8:29 AM

ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు వివిధ ప్రదేశాలకు వెళ్లినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా జలపాతాలు, నదీతీరాలు, బీచ్‌లకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. కొండలు, గుట్టలపైనుంచి జాలువారుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దాంతో సదర్శకులు జలపాతాల వద్దకు పోటెత్తుతున్నారు. తాజాగా అలా జలపాతం చూడ్డానికి వెళ్లిన వారి కారు ఆ జలపాతంలో పడిపోయింది. ఒక కారు సరస్సులో పడిపోవడాన్ని పట్టుకున్న షాకింగ్ వీడియో తెరపైకి వచ్చింది. అందులో ఒక పాప కూడా ఉంది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరిగింది.

ఇండోర్ సిమ్రోల్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం చూడటానికి పర్యాటకులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అలా అక్కడకు వచ్చిన ఓ కుటుంబ విహారయాత్రకు దంపతులు వెళ్లారు. కారుని జలపాతం దగ్గర్లో పార్క్ చేసింది. అయితే ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదు కానీ కారు రివర్స్‌ చేస్తున్నప్పుడు లేదా హ్యాండ్‌బ్రేక్‌లు వేయకపోవడంతో కొలనులో పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

వీడియోలో, రెడ్ కలర్ కారు జలపాతం అంచున నిలిపి ఉంది. ఓ వ్యక్తి  వాహన యజమాని ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్‌ సీటు నుంచి కారు డోర్‌ తెరుచుకుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో కారు ఆ వ్యక్తితో పాటు నీళ్లలో పడిపోయింది. వెంటనే అక్కడున్నవారంతా కేకలు వేశారు. ఘటన జరిగిన సమయంలో కారులో భార్య, బిడ్డ ఉన్నారు. సరస్సులో కారు తేలుతుండగా, కారులో ఉన్న ప్రయాణికులు మునిగిపోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో ఎవరికీ ఈత రాదు అనే స్వరం వినిపించింది. సమయం వృథా చేయకుండా సుమిత్ మాథ్యూ అనే యువకుడు సరస్సులో దూకి ముగ్గురు కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబ సభ్యులు ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..