- Telugu News Photo Gallery Spiritual photos These Four Zodiac Signs need to be careful because inauspicious yoga
Inauspicious Yoga: శని-రాహువుల కూటమితో ఏర్పడనున్న ‘అశుభ యోగం.. ఈ 4 రాశులు జాగ్రత్తగా ఉండాల్సిందే..
జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా శనీశ్వరుడు, రాహువులకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గ్రహాల గమనం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కొందరు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు. అన్ని గ్రహాలలో శని, రాహులు చాలా ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడుతున్నాయి. ఈ గ్రహాల ప్రభావంతో కొన్ని రాశులవారు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా..
Updated on: Aug 08, 2023 | 10:41 AM

అయితే అక్టోబర్ 17 వరకు శనిశ్వరుడు శతభిషా నక్షత్రంలో ఉంటాడు. ఈ సమయంలో శని, రాహువుల అననుకూల కలయిక కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కలయిక కొన్ని రాశులపై తీవ్ర ప్రభాన్ని చూపిస్తుంది. ఈ కారణంగా కొన్ని రాశులవారు అక్టోబర్ 17 వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల గురించి తెలుసుకుందాం.

కన్య రాశి వారు శని, రాహువుల కలయిక కారణంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ఈ రాశికి చెందిన వ్యక్తుల ఖర్చులు రెట్టింపు అవుతాయి. అదే సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చేయాలని సూచించారు. అలాగే సంపదను కోల్పోయే అవకాశం ఉంది. పనిలో వైఫల్యం, అందువల్ల మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది.

వృశ్చిక రాశి వారికి శని రాహువు కలయిక వల్ల చిన్న లేదా పెద్ద నష్టాలు కలగవచ్చు. అయితే ఈ రోజుల్లో ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రేమకు బ్రేక్ పడే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. శని రాహువు కూటమి వీరిపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వ్యక్తులు సంపదను కూడా కోల్పోవచ్చు. కనుక ఈ రాశి వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాల్సి ఉంది.

కర్కాటక రాశికి చెందిన వారు శని నీడలో ఉన్నారు. దీంతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే శని, రాహువుల కలయిక మరింత నష్టాలను పెంచుతాయి. కనుక ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. అక్టోబర్ వరకు ఈ రాశికి చెందిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.

కుంభ రాశి వారికి అక్టోబర్ వరకు కూడా కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సమయంలో భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.





























