- Telugu News Photo Gallery Spiritual photos Vastu Shastra for financial prosperity: 8 tips to welcome financial abundance at home in telugu
Vastu Tips: సిరి సంపదలు, సుఖ సంతోషాల కోసం ఇంట్లో ఈ వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించి చూడండి..
హిందూ సనాతన ధర్మంలో వాస్తుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. హిందూ పురాణాల్లో కుబేరుడు సంపదకు అధినాయకుడు. కీర్తి, బంగారానికి కారకుడుగా పరిగణిస్తారు. ఈశాన్య దిక్కును కుబేరుడు పరిపాలిస్తాడు. కనుక ఇంటి నిర్మాణంలో, వస్తువుల ఏర్పాటులో కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. టాయిలెట్, షూ రాక్‌లు, ఏదైనా భారీ ఫర్నిచర్ వస్తువులు వంటి ప్రతికూల శక్తినిచ్చే వాటిని వెంటనే తొలగించాలి.
Updated on: Aug 08, 2023 | 10:02 AM

ఇంటి ఈశాన్య మూలను చిందరవందరగా ఉంచుకోండి. ఈశాన్యం ఖాళీగా విశాలంగా ఉండనివ్వండి. అద్దం లేదా కుబేర యంత్రం ఇంటి ఉత్తర భాగంలో ఉత్తర గోడపై ఏర్పాటు చేసుకుంటే.. ఆర్థికాభివృద్ధి జరుగుతుందని విశ్వాసం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఉత్తమ మార్గాల్లో ఇంట్లో నైరుతిలో అల్మారా, బీరువా ఏర్పాటు చేసుకోవాలి. ఆభరణాలు, డబ్బు, ముఖ్యమైన ఆర్థిక పత్రాలు అన్నీ నైరుతిలో తప్పనిసరిగా ఉంచాలి. దక్షిణం లేదా పశ్చిమ దిశలో ఉంటే భారీ ఖర్చులకు దారితీస్తుందని గమనించండి. లాకర్ల తలుపు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో తెరిచే విధంగా ఉంచడం ద్వారా ఆర్థిక సమస్యలను, భారీ ఖర్చులను నివారించవచ్చు.

ఇంటిని శుభ్రంగా, చక్కగా ఉంచుకోండి. ఇంటిలోని వస్తువులను తీరుగా ఏర్పాటు చేసుకోండి. అలాగే కిటికీలు, తలుపులు శుభ్రంగా ఉంచండి. ప్రతి గదిలోని వస్తువులను చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారానికి విశిష్ట స్థానం ఉంది. సానుకూల శక్తి, సంపద, శ్రేయస్సును ఆకర్షించే.. స్వాగతించే స్థలం. కనుక తలుపులు ఆకర్షణీయంగా నిర్మించబడాలి. ప్రధాన తలుపులకు పగుళ్లు లేదా లోపాలు లేకుండా చూసుకోవాలి. తాళాలు సరిగ్గా పనిచేస్తాయని నిర్ధారించుకోండి

ఈశాన్య భాగంలో ఇంటి లోపల చిన్న నీటి వస్తువులను ఉంచడం వల్ల డబ్బు, సానుకూల శక్తిని పొందవచ్చు. అక్వేరియం లేదా చిన్న నీటి ఫౌంటెన్చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. నీరు నిలిచిపోకుండా, మురికిగా మారకుండా జాగ్రత్త వహించాలి. ఇంట్లో ఉన్న నీరు ఆర్థిక వృద్ధికి అడ్డంకులు తెచ్చే అవకాశం ఉన్నందున వీటిని తరచుగా శుభ్రం చేయాలి.

వాస్తు శాస్త్రంలో అలాంటి కొన్ని చిన్న చర్యలు ప్రస్తావించబడ్డాయి. వీటిని పాటించడం ద్వారా ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయి. అయితే కొన్ని వాస్తు నివారణలు చర్యలు చేయడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగది, బాత్రూమ్, ఆవరణ ప్రాంతంలో నీరు లీకేజ్ అవుతుంటే.. డబ్బులు కూడా వృధాగా పోతాయని.. ఆర్థిక నష్టంతో ఇబ్బందులు ఎదుర్కోవాలని విశ్వాసం. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గోడల నుండి నీటి లీకేజీలు లేదా ఇంటిలోపల విరిగిన పైప్‌లైన్ సమస్యలుంటే ఆ సమస్య తక్షణమే పరిష్కరించాలి. లేదంటే డబ్బులకు ఇబ్బందులు తప్పవు.

మరుగుదొడ్లు లేదా స్నానపు గదులు వాస్తు శాస్త్ర నిబంధనల ప్రకారం నిర్మించకపోతే.. ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరుగుదొడ్లు, స్నానపు గదులను విడివిడిగా, వీలైనంత వరకు నిర్మించాలి. ఇంటికి నైరుతి లేదా ఆగ్నేయంలో టాయిలెట్‌ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమ ఎంపిక. అయితే ఇంటి నైరుతి లేదా ఆగ్నేయ మూలల్లో వీటిని ఏర్పాటు చేసుకోవద్దు. ఇలా చేయడం వలన ద్రవ్య అస్థిరతకు మాత్రమే కాకుండా, ఆరోగ్యం, కలత నిద్ర వంటి ఇబ్బందులకు దారి తీస్తుంది.




