Pitru Paksha 2023: గయలో పూర్వీకులకు పిండి ప్రధానం అత్యంత ఫలవంతం.. క్షేత్ర విశిష్టత ఏమిటంటే..

పౌరాణిక విశ్వాసాల ప్రకారం భస్మాసురుని వంశంలో గయాసురుడు అనే దివ్య రాక్షసుడు ఉన్నాడు. అతను తన శరీరం దేవతల వలె పవిత్రంగా మారాలని కఠినమైన తపస్సు చేసి బ్రహ్మా దేవుడి నుండి అలాంటి వరం కోరుకున్నాడు. అంతేకాదు తనను దర్శనం చేసుకున్న ప్రజలు పాపాలు పోవాలని కోరుకున్నాడు. ఈ వరం తరువాత స్వర్గంలో ప్రజల సంఖ్య పెరగడం ప్రారంభించిందని..

Pitru Paksha 2023: గయలో పూర్వీకులకు పిండి ప్రధానం అత్యంత ఫలవంతం.. క్షేత్ర విశిష్టత ఏమిటంటే..
Gaya Kshetram
Follow us
Surya Kala

|

Updated on: Aug 08, 2023 | 9:08 AM

హిందూ సనాతన ధర్మం ప్రకారం, పితృపక్షంలో పూర్వీకుల ఆత్మశాంతి కోసం పిండాన్ని సమర్పించి, శ్రాద్ధం చేసే సంప్రదాయం శతాబ్దాల నాటిది. అటువంటి పరిస్థితిలో చాలా మంది తమ పూర్వీకులకు పిండి ప్రదానం చేయడానికి వివిధ పుణ్యక్షేత్రాలను ఎంచుకుంటారు. ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి గాయ. ఇక్కడకు వెళ్లి తమ పూర్వీకులకు పిండదానం చేయాలని అత్యంత ఫలవంతం అని నమ్ముతారు. పూర్వీకులు మోక్షాన్ని పొందేందుకు పిండప్రదానం ఉత్తమ మార్గమని మత విశ్వాసం. బీహార్‌లోని ఫల్గు తీరంలో ఉన్న గయా జిల్లాలో పిండ ప్రదానం చాలా ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు. హిందూ ఇతిహాసాల ప్రకారం తన తండ్రి దశరథుడి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ రాముడు కూడా గయలో పిండ ప్రదానం చేశాడని చెబుతారు.

వాస్తవానికి పిండ ప్రదానం జరిగే గయలో గతంలో 360 వివిధ పేర్లతో పిండి ప్రధాన పీఠాలు ఉండేవని నమ్ముతారు. అయితే ఇప్పుడు వీటిలో 48 మిగిలాయి. ఈ పీఠాల్లో తమ పూర్వీకులకు పిండ ప్రధానం చేస్తారు. ఇక్కడకు కొన్ని లక్షల మంది తమ పూర్వీకులకు పిండప్రదానం కోసం ఇక్కడకు చేరుకుంటారు. శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు ఇక్కడే చేస్తే పూర్వీకులకు స్వర్గం లభిస్తుందని విశ్వాసం.. శ్రీ మహా విష్ణువు స్వయంగా పితృదేవత రూపంలో ఇక్కడ ఉన్నాడని విశ్వాసం.

గయలో శ్రాద్ధ కర్మలకు ఉన్న పురాణ విశ్వాసం ఏమిటంటే?

పౌరాణిక విశ్వాసాల ప్రకారం భస్మాసురుని వంశంలో గయాసురుడు అనే దివ్య రాక్షసుడు ఉన్నాడు. అతను తన శరీరం దేవతల వలె పవిత్రంగా మారాలని కఠినమైన తపస్సు చేసి బ్రహ్మా దేవుడి నుండి అలాంటి వరం కోరుకున్నాడు. అంతేకాదు తనను దర్శనం చేసుకున్న ప్రజలు పాపాలు పోవాలని కోరుకున్నాడు. ఈ వరం తరువాత స్వర్గంలో ప్రజల సంఖ్య పెరగడం ప్రారంభించిందని.. దీనికి కారణం ప్రతిదీ నిబంధనలకు విరుద్ధంగా జరగడం ప్రారంభించిందని తెలుసుకున్నారు. దీంతో గయాసురుడిని నిలవరించడానికి, దేవతలు గయాసురుడిని యాగం కోసం పవిత్ర స్థలం కోసం అడిగారు. అప్పుడు గయాసురుడు దేవతల యాగం కోసం తన శరీరాన్ని దానం చేశాడు. గయాసురుడు పడుకున్నప్పుడు అతని శరీరం ఐదు కోసుల స్థలంలో వ్యాపించింది. అప్పటి నుండి ఈ ప్రదేశాన్ని గయ అని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు దేవతలు.. ఎవరైనా గయలో తన పూర్వీకులకు శ్రాద్ధకర్మలను ఆచరిస్తే, అతని పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని ఆశీర్వదించారు. యాగం ముగిసిన తరువాత విష్ణువు తన వీపుపై పెద్ద రాయిని ఉంచి లేచి నిలబడ్డాడు. ఈ కారణంగా నేటికీ ప్రజలు తమ పూర్వీకులకు ముక్తిని కోరుతూ పిండ ప్రదానం కోసం  గయకు చేరుకుంటారు.

శ్రాద్ధ కర్మలకు ఉన్న మతపరమైన ప్రాముఖ్యత ఏమిటి

హిందూ మత విశ్వాసాల ప్రకారం బీహార్‌లోని గయ జిల్లాను విష్ణు నగరం అని కూడా అంటారు. దీనిని మోక్ష భూమి అని కూడా అంటారు. గరుడ పురాణం ప్రకారం శ్రాద్ధ కర్మ కోసం గయను చేరిన వ్యక్తి స్వర్గ నివాసాన్ని పొందుతాడు. ఇక్కడ శ్రాద్ధం చేయడం ద్వారా నేరుగా స్వర్గానికి వెళ్తారని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్