Broom vastu tips: చీపురు విషయంలో చేసే ఈ తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు.. ఆర్థిక సమస్యలు తప్పవు..

ఆ తర్వాత ఇళ్లు ఊడవటం, తుడుచుకోవటం చేస్తే.. ఆ శ్రీ మహా లక్ష్మికి మీపై కోపం వస్తుందని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణించి వాస్తు శాస్త్రం ప్రకారం పాజిటివ్ ఎనర్జీ వెళ్లి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అందుకే ఈ సమయంలో చెత్త ఊడ్చకపోవడమే మంచిది. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే.. ప్రతిరోజూ ఇంటిని ఊడటం, తుడవటం వల్ల ఆ వ్యాధి త్వరగా నయమవుతుందని చెబుతారు.

Broom vastu tips: చీపురు విషయంలో చేసే ఈ తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు.. ఆర్థిక సమస్యలు తప్పవు..
Broom Vastu Tips
Follow us

|

Updated on: Aug 08, 2023 | 9:10 AM

వాస్తు.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తుంది. మన జీవితంలో వచ్చే అనేక మార్పులకు సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి. ఇలాంటి నమ్మకాలు శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్నాయి. వాస్తు నియమాలు, నిబందనలు అనుసరించి పనులు చేసే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వాస్తు నియమాల్లో చీపురు, ఇళ్లు ఊడ్చే సమయానికి సంబంధించిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి.. ఎవరైనా ఇంటికి వచ్చిన వెంటనే చీపురు వాడకూడదని, కొందరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చీపురు వాడకూడదని మీ ఇంటి పెద్దలు చెప్పడం మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చీపురును చాలా పవిత్రంగా, లక్ష్మీ దేవిగా భావిస్తారు. అయితే ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు చీపురు వాడకూడదనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. దాని గురించి తెలుసుకుందాం.

చీపురుకు సంబంధించిన నమ్మకాలు..

హిందూమతంలో అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి. దైనందిన జీవితంలో శుభ, అశుభ సంకేతాలతో ముడిపడి ఉన్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి.. చీపుర్ల గురించి చాలా నమ్మకాలు ఉన్నాయి. చీపురు కట్టను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అలాంటి చీపురును అగౌరవపరిచిన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదని నమ్ముతారు. చీపురుపై ఎప్పుడూ కాళ్లు పెట్టకూడదు. ఎప్పుడు దాన్ని సరైన దిశలోనే పట్టుకోవాలి. చీపురు ఎప్పుడూ మంచం కింద ఉంచకూడదని అంటారు. ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది..

బయటకు వెళ్లేటప్పుడు ఊడిస్తే..

మీరు పని నిమిత్తం బయటకు వెళ్తుంటే, దారిలో ఎవరైనా చీపురుతో ఊడవటం చూస్తే అది శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు అంటున్నారు. మీరు చేసే పనిలో విజయం సాధించలేరని నమ్ముతారు. అయితే ఇది అందరికీ, ఒకేలా ఉండదని కూడా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇళ్లు ఏ సమయంలో ఊడవాలి :

ఇంటి సభ్యులు ఎవరైనా.. ఇంటి నుండి బయటకు వెళుతున్నట్లయితే, ఆ సమయంలో ఇంట్లో చీపురు పట్టుకోకూడదు. ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళ్లిన వెంటనే, లేదంటే.. వాళ్లు వెళ్తున్న సమయంలో ఇళ్లు ఊడ్చివేస్తే, అది ఆ ఇంటి నుండి బయలుదేరిన వ్యక్తికి చెడుగా భావిస్తారు. తెల్లవారుజామునే ఇంట్లోనే చెత్తను ఊడ్చేసుకోవటం ఉత్తమ సమయంగా చెబుతారు. ఈ సమయంలో ఇళ్లు ఊడవటం, తుడుచుకోవడం ఇంటికి శ్రేయస్సును తెస్తుంది.

వాస్తు ప్రకారం.. సాయంత్రం పూట చెత్త ఊడ్చకూడదు. మీరు సూర్యాస్తమయం తర్వాత ఇళ్లు ఊడవటం, తుడుచుకోవటం చేస్తే.. ఆ శ్రీ మహా లక్ష్మికి మీపై కోపం వస్తుందని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణించి వాస్తు శాస్త్రం ప్రకారం పాజిటివ్ ఎనర్జీ వెళ్లి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అందుకే ఈ సమయంలో చెత్త ఊడ్చకపోవడమే మంచిది.

చీపురుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు:

వాస్తు శాస్త్రంలో చీపురు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం చీపురు ఇంటి ముందు ఎప్పుడూ ఉంచరాదు. ఇంటిని శుభ్రం చేసిన వెంటనే బయటి వారికి కనిపించని ప్రదేశంలో ఉంచండి. అంతేకాదు.. విరిగిన చీపురును ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోకూడదు. పాడైపోయిన చీపురు వెంటనే ఇంట్లోంచి తీసేసి కొత్త చీపురు తీసుకురావాలి, శుక్రవారం కొత్త చీపురు తీసుకురావడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. విరిగిన చీపురును ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని నమ్ముతారు.

చీపురు సంబంధించిన వాస్తు నమ్మకాలు..

మనం వాస్తును నమ్ముకుంటే, కొత్త సంవత్సరం రోజున చీపురు తీసుకురావడం వల్ల గత సంవత్సరంలోని అన్ని అరిష్టాలు తొలగిపోతాయి.

ప్రతిరోజూ మంచం కింద తప్పకుండా ఊడ్చుకోవటం, తూడ్చు కోవటం వల్ల మీకు పీడకలలు తొలగిపోతాయి.

ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే.. ప్రతిరోజూ ఇంటిని ఊడటం, తుడవటం వల్ల ఆ వ్యాధి త్వరగా నయమవుతుందని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..