Dosa Challenge: ఫుడ్ ఛాలెంజ్.. ఈ క్రిస్పీ దోసె తినండి.. బంపర్‌ క్యాష్‌ ప్రైజ్‌ గెలుచుకోండి..ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఒక్కడినే తినేస్తానంటూ బలమైన ధీమా వ్యక్తం చేశారు. మరొకరు, భలే మంచి అవకాశం..ఈ మాత్రం లేట్‌ చేయకుండా ఈజీగా ఆప్లేట్‌ ఖాళీ చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. మరో వినియోగదారుడు.. మీరు డబ్బులు దాచుకోండి..

Dosa Challenge: ఫుడ్ ఛాలెంజ్.. ఈ క్రిస్పీ దోసె తినండి.. బంపర్‌ క్యాష్‌ ప్రైజ్‌ గెలుచుకోండి..ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
Dosa Challenge
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 05, 2023 | 1:57 PM

దోసె చాలా మందికి ఇష్టమైన అల్పాహారం. ఎక్కువ మసాలా లేకుండా మెత్తగా, క్రిస్పీగా ఉండే దోసె భోజన ప్రియులకు నోరూరించేది. అయితే మీకు నచ్చిన దోసె తింటే ప్రైజ్ వస్తుందని మీకు తెలుసా? అవును మీరు చదివింది నిజమే. దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన బ్రేక్‌ ఫాస్ట్‌లో దోస ఒకటి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కూడా దోసెను తినడానికి ఇష్టపడతారు. సాదా దోసె, సెట్ దోసె, రవ్వ దోసె, మసాలా దోసె, ఉల్లి దోసె ఇలా ఒకటి రెండు దోసెలు కాదు.. చాలా రకాలు ఉన్నాయి.. మసాలా దినుసుల హడావిడి లేకుండా, కడుపులో ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి చాలా మంది దోసె తినడానికి ఇష్టపడతారు. అయితే, ఎక్కడైనా డబ్బులు ఇచ్చి దోసె తింటారు..? కానీ, ఇక్కడికి వెళ్తే దోసె తిన్నంత డబ్బులు ఇస్తారని తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే..!

ఢిల్లీలోని దోసెల స్పెషల్ హోటల్‌ అటువంటి ప్రత్యేకమైన దోసె ఛాలెంజ్‌ని నిర్వహించింది. ఇక్కడ 6 అడుగుల పొడవున్న దోసె తింటే..రూ.11,000. బహుమతి పొందవచ్చు. @pestolicious అనే ఇన్‌స్టాగ్రామ్ బ్లాగర్ సావి దోసా ఛాలెంజ్ వీడియోను పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

న్యూ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ప్రముఖ దోస రెస్టారెంట్ అయిన దోస ఫ్యాక్టరీలో ఈ వీడియో చిత్రీకరించబడింది. వీడియో వైరల్ పోస్ట్ నుండి 5.7 మిలియన్ల మంది వీక్షించారు. 383 వేల లైక్‌లు వచ్చాయి. వైరల్ వీడియోలో ఈ 6 అడుగుల పొడవు దోస తయారీని కూడా చూపించారు. అక్కడ మూడు పెద్ద దోసెలు ఏకకాలంలో తయారు చేశారు. దానిపై చీజ్‌తో పాటు వివిధ రకాల మసాలా దినుసులను కూడా యాడ్‌ చేశారు. ఆ తర్వాత ఈ భారీ దోసెను సాంబార్, చట్నీతో వడ్డిస్తారు. అయితే, ఈ దోసెను పూర్తిగా తిన్న వారికి రూ. 11,000 చెల్లించాలనేది రెస్టారెంట్ నిబంధన. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఒక్కడినే తినేస్తానంటూ బలమైన ధీమా వ్యక్తం చేశారు. మరొకరు, భలే మంచి అవకాశం..ఈ మాత్రం లేట్‌ చేయకుండా ఈజీగా ఆప్లేట్‌ ఖాళీ చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. మరో వినియోగదారుడు.. మీరు డబ్బులు దాచుకోండి..నేను ఫ్రీగానే తినిపెడతాను అంటూ కామెంట్‌ చేశారు.

మరొకరు ‘అమ్మా వంటగదిలో దోసెలు తీసుకువెళుతుండగా నేను తవా నుండి నేరుగా 20-25 దోసెలు తింటాను’ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘ఇలా ఫుడ్ ఛాలెంజ్ పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేయకండి’ అని మరో వినియోగదారు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి 6 అడుగుల నిడివి ఉన్న డోస్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న మాట కూడా నిజం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..