AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఒకే ఒక్కడు.. 10 మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు.. బీచ్‌లో గ్రాండ్‌గా వివాహ వేడుక..

అంతేకాదు.. మనోడు మహా ముదురు.. అందుకే అలా సీక్రెట్‌గా చేసుకున్న పెళ్లిళ్లు బయట పడకుండా.. ఒక్కొక్కరిని ఒక్కో ప్రదేశంలో ఉంచి మెయిన్‌టెన్‌ చేసేవాడు..ఆస్ట్రేలియాలో ఉంటే ఇండియాలో బిజినెస్ అని, ఇండియాలో ఉన్నప్పడు అమెరికాలో బిజినెస్ అంటూ పెద్ద పెద్ద బిల్డప్‌ మాటలు చెబుతూ అందరినీ బురిడీ కొట్టించేవాడు..కానీ, ఎట్టకేలకు సదరు కేటుగాడి భాగోతం బట్టబయలైంది.

Viral News: ఒకే ఒక్కడు.. 10 మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు.. బీచ్‌లో గ్రాండ్‌గా వివాహ వేడుక..
Man Married With 10 Women
Jyothi Gadda
|

Updated on: Aug 05, 2023 | 12:08 PM

Share

సాధారణంగా పెళ్లిళ్లలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఉండటం కామన్‌. ఆ ఇద్దరూ వివాహమనే బందంతో ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేస్తారు. అయితే ఈ రోజు మనం చెప్పబోయే పెళ్లిలో వరుడు ఒక్కడే.. కానీ,10 మంది వధువులు ఉన్నారు. అవును మీరు చదివింది నిజమే.. ఒకే ఒక్కడు 10 యువతుల్ని వివాహం చేసుకున్నాడు. అమెరికాలోని న్యూయార్క్‌లో నివసిస్తున్న 28 ఏళ్ల ఇమ్మాన్యుయేల్ 10 అమ్మాయిలతో పెళ్లి చేసుకుని లస్టిన్ బీచ్ లో వేడుక చేసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి క్యాప్షన్‌గా ఈ రోజు నేను పది మంది పెళ్లి కూతుళ్లను వివాహం చేసుకున్నాను..వీరంతా నా భార్యలు అనే క్యాప్షన్‌తో వీడియో షేర్‌ చేశారు.

లస్టిన్ ఈ సంబంధంలో అనేక భాషలు, అనేక వ్యక్తిత్వాలు, అనేక అందమైన ప్రదర్శనలు ఉంటాయి. కానీ మనమందరం పంచుకునేది ప్రేమ, అప్యాయతలు అని పేర్కొన్నాడు. తొమ్మిది సెకన్ల వీడియోలో తొమ్మిది మంది వధువులు తమ వరుడి చుట్టూ తిరుగుతున్నారు. పొట్టి తెల్లని బట్టలు వేసుకుని ఉన్నాడు. ఫ్లవర్ బుకే ఒకటి చేతిలో పట్టుకుని కనిపించారు. ఒక వధువు లస్టిన్ ఒడిలో కూర్చుని ఉండటం కనిపించింది.

న్యూయార్క్‌లో వీళ్లు ఉంటున్న ప్రదేశంలో ఈ తరహా పెళ్లిళ్లకు గుర్తింపు ఉండదని చెబుతున్నారు. టిక్‌టాక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో లస్టిన్ కంటెంట్‌ను పోస్ట్ చేస్తాడు. అతడు సోషల్ మీడియాలో చాలా ఫేమస్‌. వాటిలో చాలా అశ్లీల చిత్రాలు, వీడియోలు కూడా ఉన్నాయి. ఈ వివాహం జూలై 31న జరిగింది. లస్టిన్ ఒక హైతియన్ అమెరికన్. హైతీ ఒక ఆఫ్రికన్ దేశం. ఈ 28 ఏళ్ల ఇమ్మాన్యుయేల్ వివాహ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. లుస్టిన్ బీచ్ వేడుకలో 10 మంది మహిళలతో అసభ్యంగా కనిపించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో నెటిజన్లు తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గతంలో కూడా ఓ వ్యక్తి చెడు వ్యసనాలు, దొంగతనాలు చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఏకంగా 10 మందిని పెళ్లి చేసుకున్నాడు. చోరీలు, లూటీలు చేస సంపాధించిన డబ్బుతో ఖరీదైన కార్లలతో తిరుగుతూ దాదాపు ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. మనోడు మహా ముదురు.. అందుకే అలా సీక్రెట్‌గా చేసుకున్న పెళ్లిళ్లు బయట పడకుండా.. ఒక్కొక్కరిని ఒక్కో ప్రదేశంలో ఉంచి మెయిన్‌టెన్‌ చేసేవాడు..ఆస్ట్రేలియాలో ఉంటే ఇండియాలో బిజినెస్ అని, ఇండియాలో ఉన్నప్పడు అమెరికాలో బిజినెస్ అంటూ పెద్ద పెద్ద బిల్డప్‌ మాటలు చెబుతూ అందరినీ బురిడీ కొట్టించేవాడు..కానీ, ఎట్టకేలకు సదరు కేటుగాడి భాగోతం బట్టబయలైంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..