AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చీరల కోసం కొట్టుకున్న మహిళలు.. కాల్పులకు దిగిన భర్తలు.. ఆరుగురు అరెస్ట్..

వాస్తవానికి చాలామంది ప్రజలు తక్కువ ధరకు వస్తువులు లభిస్తాయంటే చాలు.. ఓ రేంజ్ లో వాటికోసం ఎగబడతారు. అవసరానికి మించి మరీ షాపింగ్ చేస్తారు. తక్కువ ధరకు, మంచి వస్తువులను తాము దక్కించుకోవాలనే  క్రమంలో  కస్టమర్స్ మధ్య జరిగే వాగ్వాదం.. ఫీక్ స్టేజ్ కు చేరుకుని కొట్లాటకు చేరుకోవడం చాలా సార్లు జరుగుతుంది. అమ్మకం జరుగుతున్నప్పుడు భీకర పోరు జరిగిన సంఘటనలు అనేకం. 

Surya Kala
|

Updated on: Aug 05, 2023 | 12:03 PM

Share

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా ఎక్కడైనా తక్కువ ధరకే వస్తువులను అందిస్తున్నాము అని ఏదైనా దుకాణ యజమాని ప్రకటిస్తే చాలు.. అక్కడ చోటు చేసుకునే సంఘటనలు సంబంధించిన వీడియోలకు కొదవే లేదు. ఇక ఆడవాళ్లకు బంగారం, చీరల అంటే ఉన్న ఇష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ముఖ్యంగా చీరలపై ఆఫర్లు ప్రకటిస్తే .. ఆ దుకాణం ముందు ఆడవారు బారులు తీరతారు.. అయితే భారతీయులకు మాత్రమే చీరలు పిచ్చి అనుకుంటే తప్పే అని తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో రుజువు చేసింది.

వాస్తవానికి చాలామంది ప్రజలు తక్కువ ధరకు వస్తువులు లభిస్తాయంటే చాలు.. ఓ రేంజ్ లో వాటికోసం ఎగబడతారు. అవసరానికి మించి మరీ షాపింగ్ చేస్తారు. తక్కువ ధరకు, మంచి వస్తువులను తాము దక్కించుకోవాలనే  క్రమంలో  కస్టమర్స్ మధ్య జరిగే వాగ్వాదం.. ఫీక్ స్టేజ్ కు చేరుకుని కొట్లాటకు చేరుకోవడం చాలా సార్లు జరుగుతుంది. అమ్మకం జరుగుతున్నప్పుడు భీకర పోరు జరిగిన సంఘటనలు అనేకం.

మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన పాకిస్తాన్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఓ షాప్ లో చీరల కొనుగోళ్ల విషయంలో మహిళల మధ్య గొడవ జరిగింది. ఎక్కడ మొదలైందో ఎలా మొదలైందో తెలియదు.. కానీ హఠాత్తుగా స్త్రీలు కొట్టుకోవడం మొదలు పెట్టారు.. వెంటనే ఆ మహిళల భర్తలు కూడా ఇక్కడ జోక్యం చేసుకున్నారు. అక్కడ ఉన్న పురుషులు పిస్టల్స్ తీసుకుని కాల్పులు జరుపుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగారు. ఘర్షణకు దిగిన ఆరుగురిని అరెస్టు చేసి అక్కడి నుండి తీసుకుని వెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు