Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఓర్నీ బుడ్డది.. ఎంత పనిచేసింది..! వాషింగ్‌ మెషీన్‌ డ్రైయర్‌లో ఇరుక్కున్న చిన్నారి.. రంగంలోకి రెస్క్యూ టీం..

ఆ చిన్నారి ఇరుక్కున్న డ్రైయర్‌ను బయటకు తీశారు. పాప చేతులు, కాళ్ళు మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. సీన్‌ చూడగానే భయం పుట్టేలా ఉంది. ఆ తర్వాత మెషిన్ నుంచి డ్రైయర్ కట్ చేసి చిన్నారిని బయటకు తీశారు. సాయం చేయడంలో మరికొంత ఆలస్యం చేసి ఉంటే చిన్నారిని రక్షించడం అసాధ్యమని వీడియో చూస్తుంటే అర్థమవుతోంది.

Watch: ఓర్నీ బుడ్డది.. ఎంత పనిచేసింది..! వాషింగ్‌ మెషీన్‌ డ్రైయర్‌లో ఇరుక్కున్న చిన్నారి.. రంగంలోకి రెస్క్యూ టీం..
Firefighters Rescue Kid
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 05, 2023 | 11:10 AM

Firefighters Rescue: ఇంట్లో పిల్లలుంటే ఆ సందడే వేరు. పిల్లలు చేసే అల్లరి చేష్టలతో చిటికెలో ఒత్తిడిని మాయమవుతుంది. అయితే కొంతమంది చిన్నారులు చేసే అల్లరి నెక్ట్స్‌ లేవల్‌లో ఉంటుంది. సుమారు 10 నెలల వయసు నుండే పిల్లలు చేసే అల్లరి మొదలవుతుంది. మెల్లిగా ముందుకు పాకుతూ.. బుడి బుడి అడుగులు వేసుకుంటూ చిన్నారిలు అల్లరి చేస్తుంటే.. ఆ సందడి ఇంటిల్లిదికి పండగలా ఉంటుంది. ఇక ఇంకాస్త పెరిగిన పిల్లలు చేసే అల్లరి, చిలిపి చేష్టాలు వర్ణీంచటం కూడా కష్టమే. అలాంటి వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే, పిల్లల అల్లరి పనులు కొన్ని కొన్ని సందర్భాల్లో వా రిని ప్రమాదాల్లోకి నెడుతుంటాయి. కొందరు చిన్నారులు తెలిసి తెలియక హానికరమైన వస్తువులను తాకటం, మెట్లపై నుంచి కింద పడిపోవటం వంటివి కూడా అప్పుడప్పుడు అవుతుంటాయి. అయితే, ఇక్కడ కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఓ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి వాషింగ్ మెషీన్ డ్రైయర్‌లో పడిపోయింది. డ్రైయర్‌ పడిపోయిన చిన్నారి అరుపులు విన్న తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చాయి. చిన్నారిని బయటకు తీసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా చిన్నారిని బయటకు తీసుకురాలేకపోయారు. దాంతో చివరికి చేసేది లేక ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు ఫోన్ చేయగా రెస్క్యూ టీం హుటా హుటినా వాళ్ల ఇంటికి చేరుకుంది. గంటల తరబడి పోరాడి ఎట్టకేలకు చిన్నారిని బయటకు తీశారు. చాలా సార్లు, చిన్న పిల్లలు ఆడుకుంటూ తరచూ ప్రమాదంలో పడుతుంటారు. అలాంటిదే ఈ ఘటన కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాషింగ్ మెషీన్ డ్రైయర్‌లో ఒక చిన్న పిల్లవాడు ఇరుక్కుపోయినకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

అకస్మాత్తుగా చిన్నారి అరుపులు విన్న మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి మెషీన్‌లో చిక్కుకున్న చిన్నారిని చూసి వేగంగా బయటకు తీసేందుకు ప్రయత్నించింది. చిన్నారిని బయటకు తీసేందుకు విఫల ప్రయత్నం చేసింది. ఇక లాభం లేదనుకున్న ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా..అత్యవసర సేవలకు కాల్ చేసింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి ప్రయత్నించి చిన్నారిని రక్షించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

View this post on Instagram

A post shared by The Mirror (@dailymirror)

అగ్నిమాపక సిబ్బంది మెషీన్‌ను పూర్తిగా ఓపెన్‌ చేశారు. ఆ చిన్నారి ఇరుక్కున్న డ్రైయర్‌ను బయటకు తీశారు. పాప చేతులు, కాళ్ళు మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. సీన్‌ చూడగానే భయం పుట్టేలా ఉంది. ఆ తర్వాత మెషిన్ నుంచి డ్రైయర్ కట్ చేసి చిన్నారిని బయటకు తీశారు. సాయం చేయడంలో మరికొంత ఆలస్యం చేసి ఉంటే చిన్నారిని రక్షించడం అసాధ్యమని వీడియో చూస్తుంటే అర్థమవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..