Watch: వారెవ్వా.. ఏం ఐడియా గురూ..! గోల్డ్ స్మగ్లింగ్ లో కొత్త కోణం.. అయినా దొరికేశాడు!
హైదరాబాద్‌లోని ఆర్‌జిఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని పట్టుకుని అతని వద్ద నుండి 471 గ్రాముల గోల్డ్ శారీని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో బంగారాన్ని దాచి బట్టలపై స్ప్రే చేసి దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు.
Hyderabad Customs: మన దేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ మరే ఇతర వస్తువుకు ఉండదు. అందుకే గోల్డ్ ధరలు డిమాండ్‌కు తగ్గట్టుగానే ఎప్పుడూ ఆకాశంలోనే స్థిరపడి ఉంటాయి. ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి ప్రజలు పసిడి వైపు చూడాలంటే కూడా భయపడిపోయేలా భగ్గుమంటోంది బంగారం ధర. మరోవైపు ఇతర దేశాలు,ప్రాంతాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పుత్తడిని మరింత ప్రియంగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఎయిర్‌పోర్టులు, సరిహద్దుల్లో ఎంత పటిష్ట నిఘా ఏర్పాటు చేసినా కూడా అక్రమార్కులు ఆగడం లేదు.. రోజు రోజుకు బంగారం అక్రమ రవాణా పెరిగిపోతోంది. గుట్టుగా గోల్డ్‌ను అక్రమంగా తరలించేందుకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు స్మగ్లర్లు.
ఒంటికి వేసుకుని షర్ట్ బటన్‌లో బంగారం, షూలలో, సూట్ కేసుల్లో.. చివరకు మందు బిల్లలుగా మార్చి కడుపులో దాచుకుని వచ్చిన ఘటనలు కూడా కస్టమ్స్ అధికారులు చేధించారు. ఇలా చిత్ర విచిత్రాలుగా బంగారం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు..గోల్డ్‌ని ఎక్కడా దాచినా కస్టమ్స్ అధికారులు కనిపెట్టేశారు. ఇక తాజాగా పట్టుబడి స్మగ్లర్ మరరో కొత్త పథకం వేశాడు.. వినూత్నంగా ఆలోచించి బంగారంతో చీర తయారుచేశాడు. తన దుస్తుల్లో కలిపేశాడు. అయినప్పటికీ అధికారులకు దొరికిపోయాడు.
ఆగస్టు 04 శుక్రవారం రోజున శంషాబాద్ విమానాశ్రయంలో బంగారు చీర పట్టుబడింది. హైదరాబాద్‌లోని ఆర్‌జిఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని పట్టుకుని అతని వద్ద నుండి 471 గ్రాముల గోల్డ్ శారీని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో బంగారాన్ని దాచి బట్టలపై స్ప్రే చేసి దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు.
28 lakhs worth of gold was seized by customs at @RGIAHyd from a Dubai passenger. He concealed the gold by spraying it over clothes and packed it amidst the luggage. #gold #goldsmuggling #RGIA@hydcus @cbic_india @XpressHyderabad@NewIndianXpress pic.twitter.com/d9llirhQb3
— Priya Rathnam (@Rathnam_jurno) August 4, 2023
అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని తనిఖీ చేసి రూ.28.1 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. అయితే, బంగారాన్ని లిక్విడ్ గా మార్చి ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా.. చీరపై స్ప్రే గా కొట్టి, స్మగ్లింగ్ చేసిన కేటుగాడి తెలివితేటలకు అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
మరిన్నితెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..