AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: టేబుల్ పక్కనే చేతులు కడిగిన కస్టమర్.. వాష్‌బేసిన్ ఉన్నా ఇదేం పని?

సింగపూర్‌లో ఓ కస్టమర్ చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. రెస్టారెంట్‌లో పక్కనే వాష్‌బేసిన్ ఉన్నప్పటికీ.. డైనింగ్ టేబుల్ పక్కనే చేతులు కడుక్కున్నాడు. దాంతో నీళ్లన్నీ నేలపై పడ్డాయి. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అతడి ప్రవర్తనపై విమర్శలు చేస్తున్నారు.

Video: టేబుల్ పక్కనే చేతులు కడిగిన కస్టమర్.. వాష్‌బేసిన్ ఉన్నా ఇదేం పని?
Man Washes Hands Beside Dining Table Inspite A Basin Behind
Sharada V
|

Updated on: Nov 01, 2026 | 6:37 PM

Share

సింగపూర్‌లో ఓ కస్టమర్ చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. రెస్టారెంట్‌లో పక్కనే వాష్‌బేసిన్ ఉన్నప్పటికీ.. డైనింగ్ టేబుల్ పక్కనే చేతులు కడుక్కున్నాడు. దాంతో నీళ్లన్నీ నేలపై పడ్డాయి. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అతడి ప్రవర్తనపై విమర్శలు చేస్తున్నారు.

టేబుల్ పక్కనే చేతులు కడుక్కున్న కస్టమర్

సింగపూర్‌లోని DK Signatures రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి ఓ మహిళతో కలిసి భోజనానికి కూర్చున్నాడు. కొద్ది అడుగుల దూరంలో వాష్‌బేసిన్ ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లకుండా తింటున్న టేబుల్ పక్కనే చేతులపై నీళ్లు పోసుకుని కడుక్కోవడం ప్రారంభించాడు. దీంతో నీళ్లన్నీ నేలపై ఒలకిపోయాయి. ఎదురుగా కూర్చున్న మహిళ  పట్టించుకోకుండా చూస్తూ కనిపించింది. ఘటనపై ఆగ్రహించిన  రెస్టారెంట్ యాజమాన్యం సీసీటీవీ ఫుటేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కస్టమర్లు తింటుండగానే నేలను శుభ్రం చేసిన ఉద్యోగి

ఆ వ్యక్తి చేసిన పనితో రెస్టారెంట్ నేలంతా తడిసిపోయింది. అది గమనించిన క్లీనర్ వెంటనే మాప్ తీసుకొచ్చి నేలను శుభ్రం చేయడం ప్రారంభించాడు. అయితే ఆ వ్యక్తి, అతడితో పాటు ఉన్న మహిళ మాత్రం ఉద్యోగికి కలిగిన ఇబ్బందిని పట్టించుకోకుండా భోజనం చేస్తూనే ఉన్నారు. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. పక్కనే వాష్‌బేసిన్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి చేతులు కడుక్కోవడానికి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. రెస్టారెంట్ సిబ్బందిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదని కామెంట్లు చేస్తున్నారు.

రెస్టారెంట్ యాజమాన్యం ఏమందంటే?

తమ రెస్టారెంట్ ప్రవేశ ద్వారం దగ్గరే వాష్‌బేసిన్ ఉందని, వెనుకవైపు టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించామని DK Signatures రెస్టారెంట్ స్పందించింది. కొన్ని రకాల వంటకాలు, ముఖ్యంగా రొయ్యల నూడుల్స్, సీఫుడ్ వంటి ఆహార పదార్థాలను చేతులతో తింటే అద్భుత రుచిని ఆస్వాదిస్తారనీ తిన్న తర్వాత చేతులు శుభ్రం చేయాలనుకోవడంలో తప్పులేదని స్పష్టం చేసింది.  ఇందుకోసం డైనింగ్ టేబుల్‌ను ఉపయోగించడం సరికాదని వ్యంగ్యంగా తెలిపింది.

టేబుల్ పక్కనే నీళ్లు పోసుకోవడం వల్ల నేల తడిగా మారి పరిశుభ్రతను దెబ్బతీయడమే కాకుండా, ఇతరులు జారిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే పనులతో బిజీగా ఉండే సిబ్బందికి ఇది అదనపు శ్రమ అంటూ వ్యాఖ్యానించింది. కస్టమర్లు తమ చుట్టూ ఉన్న పరిసరాలను, అక్కడ పనిచేసే ఉద్యోగుల పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలని కోరింది. చేతులు కడుక్కోవడానికి కొన్ని అడుగులు నడిచి వాష్‌బేసిన్ దగ్గరకు వెళ్లాలని సూచించింది. రెస్టారెంట్‌లో సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని వినియోగించుకోవాలన్న సందేశం ఇస్తూ పోస్ట్ చేసిన వీడియో రెస్టారెంట్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ నెట్టింట వైరల్ అవుతోంది.

Follow Us