Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: సరదా తీర్చేసిన ‘1M’ ఫాలోవర్లు..! విన్యాసాల యువతికి అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..

Trending: సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ప్రతి ఒక్కరూ స్టార్ అయిపోతారనే భ్రమలో నేటి యువత ప్రాణాలకు తెగించి మరీ రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో రైలు ఢీకోని, రోడ్డు ప్రమాదంలో మరణించిన యువతీయువకులు ఎందరో ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరగకపోయినా.. జరిగే అంతటి పని చేసిన ఓ యువతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట..

Trending: సరదా తీర్చేసిన '1M' ఫాలోవర్లు..! విన్యాసాల యువతికి అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..
Viral Video Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 05, 2023 | 12:08 PM

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక రీల్స్ పుణ్యమా అని  వేలాది మంది యువత ఓవర్‌నైట్ స్టార్‌లుగా మారిపోయారు. అయితే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ప్రతి ఒక్కరూ స్టార్ అయిపోతారనే భ్రమలో నేటి యువత ప్రాణాలకు తెగించి మరీ రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో రైలు ఢీకోని, రోడ్డు ప్రమాదంలో మరణించిన యువతీయువకులు ఎందరో ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరగకపోయినా.. జరిగే అంతటి పని చేసిన ఓ యువతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను షేర్ చేసింది మాత్రం తాను కాదు.. మరెవరు అనుకుంటున్నారా..? పోలీసులు. అవును, రీల్స్‌ని పోలీసులు షేర్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అక్కడే ఉంది ట్విస్ట్.

కొన్ని రోజుల క్రితం నెట్టింట ఓ వీడియో వైరల్ అయింది. అందులో25 ఏళ్ల ఓ యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న సందర్భంగా జలంధర్-జమ్మూ జాతీయ రహదారిపై కదులుతున్న థార్ కార్ బానెట్‌పై కూర్చుని 1M ఫాలోవర్స్‌ని సంపాదించాను అనేలా విన్యాసాలు చేసింది. అందుకు సంబంధించిన సన్నివేశాలను కూడా వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియో కాస్త పంజాబ్ పోలీసుల కంట పడడంతో వారు యాక్షన్‌లోకి దిగారు. కార్ నెంబర్ ఆధారంగా కూపీ లాగి, స్థానికి హోషియార్‌పూర్ పోలీసులకు తెలియజేశారు. అంతే వారు కార్‌ని సీజ్ చేశారు. ఇంకా ఆ కార్ ఓనర్ కోసం విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు హోషియార్‌పూర్ పోలీసులు  సదరు యువతికి చెందని వీడియోను, ఇంకా వారు తీసుకున్న చర్యలను పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు. యువతి పోస్ట్ చేసిన వీడియో కంటే పోలీసుల వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హోషియార్‌పూర్ పోలీసులు.. వీడియోను చూసిన తక్షణమే చర్యలు తీసుకున్నామని, ట్రాఫిక్ నిబంధనల పరిధిలోకి తీసుకుని కార్‌ను సీజ్ చేశామని, భవిష్యత్తులో అలా చేయవద్దని సదరు యువతికి సూచించామని తెలియజేశారు. కాగా, వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తగిన శాస్తి జరిగిందంటూ, 10 లక్షల ఫాలోవర్లు రాగానే థార్ కార్ పోయిందంటూ రాసుకొస్తున్నారు. అలాగే కార్‌ని సీజ్ చేయడమే కాక సదరు యువతిపై యాక్షన్ తీసుకోవాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు.