Stuart Broad: రిటైర్మెంట్ ప్రకటించిన వారంలోనే మళ్లీ ఆరంగేట్రం.. తిరిగొచ్చిన బ్రాడ్‌కి దినేష్ కార్తిక్ స్వాగతం..

Stuart Broad: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదో టెస్టు జరుగుతున్న సమయంలోనే రిటైర్‌మెంట్ ప్రకటించిన ఇంగ్లీష్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. మ్యాచ్ అనంతరం విడ్కోలు పలికాడు. అయితే ఇప్పుడు బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కి ముగింపు పలికినా.. ఆటకు మాత్రం దూరం కాబోను అంటున్నాడు. ఈ  క్రమంలోనే ఆటకు దగ్గరగా ఉండే మరో విభాగంలో ఆరంగేట్రం..

Stuart Broad: రిటైర్మెంట్ ప్రకటించిన వారంలోనే మళ్లీ ఆరంగేట్రం.. తిరిగొచ్చిన బ్రాడ్‌కి దినేష్ కార్తిక్ స్వాగతం..
Stuart Broad
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 05, 2023 | 11:04 AM

Stuart Broad: యాషెష్ టెస్ట్ సిరీస్ ముగిసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా రెండు టెస్టులు, ఇంగ్లాండ్ 2 టెస్టులు గెలవగా ఓ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. దీంతో సిరీస్‌ని ఇరు జట్లు 2-2 గా పంచుకున్నాయి. అయితే ఇరుజట్ల మధ్య ఐదో టెస్టు జరుగుతున్న సమయంలోనే రిటైర్‌మెంట్ ప్రకటించిన ఇంగ్లీష్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. మ్యాచ్ అనంతరం విడ్కోలు పలికాడు. అయితే ఇప్పుడు బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కి ముగింపు పలికినా.. ఆటకు మాత్రం దూరం కాబోను అంటున్నాడు. ఈ  క్రమంలోనే ఆటకు దగ్గరగా ఉండే మరో విభాగంలో ఆరంగేట్రం కూడా చేశాడు. ఇక బ్రాడ్ ఆరంగేట్రం సందర్భంగా అతనికి భారత జట్టు వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ స్వాగతం పలికాడు.

అవును, బ్రాడ్ తన క్రికెట్ కెరీర్‌కి ముగింపు పలికాడు. కానీ క్రికెట్ నుంచి దూరం కాలేదు. రిటైర్‌మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే క్రికెట్‌ కామెంటేటర్‌గా ఆరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్రీలో బ్రాడ్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. దినేష్ కార్తిక్ ఇంకా క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకోకున్నా కామెంటరీ చెబుతున్నాడు. ఇక కామెంటేటర్‌గా బ్రాడ్ ఆరంగేట్రం చేస్తున్న సందర్భంలో అతనికి దినేష్ స్వాగతం పలికాడు. ఇంకా తన ట్విట్టర్ ఖాతా నుంచి ‘స్వాగతం బ్రాడ్.. నువ్వు బాగా రాణించగలవు’ అంటూ ట్వీట్ చేశాడు. దీనేష్ కార్తిక్ చాలా కాలంగా స్కై స్పోర్ట్స్ తరఫున కామెంటేటర్‌ పాత్రలో కనిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

కాగా, విజయవంతంగా రాణిస్తున్న సమయంలో 37 ఏళ్ల బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బ్రాడ్ ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. తాను ఆడిన చివరి సిరీస్ అయిన యాషెస్ సిరీస్-2023 లో కూడా సత్తా చాటాడు. ఇంకా సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ తరఫున మొత్తం 22 వికెట్లు తీశాడు. మరోవైపు స్టువర్ట్ బ్రాడ్ ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యంత విజయవంతమైన రెండో బౌలర్. టెస్టు క్రికెట్‌ని అమితంగా ప్రేమించే ఆ దేశం తరఫున జేమ్స్ ఆండర్సన్  183 టెస్టుల్లో 690 వికెట్లు తీసి అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. జిమ్మీ తర్వాత బ్రాడ్ 167 మ్యాచ్‌ల్లో 604 వికెట్లు తీసి ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..