Babar Azam: ఓరే ఆజామూ.. భారీ గిఫ్ట్‌తో ఫిక్సింగ్ పుకార్లు.. కట్‌చేస్తే.. ప్లేయింగ్ 11 నుంచి ఔట్?
Babar Azam Controversy: పాకిస్తాన్ క్రికెట్ జట్టు సెమీస్ కోసం శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతోంది. అయితే, ఈ మ్యాచ్ నుంచి పాక్ దిగ్గజం బాబర్ ఆజాంను తప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిక్సింగ్ ఆరోపణలతో ఈ దిగ్గజం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో పాకిస్థాన్ శనివారం శ్రీలంకతో డూ-ఆర్-డై మ్యాచ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో కనీసం 64 పరుగుల తేడాతో గెలిస్తేనే నెట్ రన్‌రేట్‌లో న్యూజిలాండ్‌ను దాటి సెమీఫైనల్‌లోకి చేరుకోవచ్చు. ఈ హై వోల్టేజ్ సమరంలో అతిపెద్ద వార్త ఏంటంటే, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) జట్టులో లేడు.
ఒకప్పుడు పాకిస్థాన్ క్రికెట్‌కు పోస్టర్ బాయ్‌గా నిలిచిన బాబర్, టోర్నీ కీలక రాత్రిలో బెంచ్‌పైనే ఉండడం చర్చనీయాంశమైంది. అయితే, వివాదాల మధ్య బాబర్ పేరు వినిపించడం ఇదే మొదటిసారి కాదు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై చర్చ..
2024 టీ20 వరల్డ్ కప్‌నకు వెళ్లితే, పాకిస్థాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2022లో రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ఇది పెద్ద షాక్. అమెరికా, భారత్ చేతుల్లో పరాజయాలు జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. చివరి రెండు మ్యాచ్‌లు గెలిచినా అప్పటికే నష్టం జరిగిపోయింది.
ఆ సమయంలో విమర్శలు తీవ్రమయ్యాయి. ఫిట్‌నెస్ నుంచి ఆటలో ఉత్సాహం లేకపోవడం వరకు అన్నీంటిపైనా ప్రశ్నల వర్షం కురిపింది. సోషల్ మీడియాలో స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చక్కర్లు కొట్టాయి. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (Pakistan Cricket Board) ఈ ఆరోపణలను “ఆధారంలేనివి”గా కొట్టిపారేసింది. అయినా ఒకసారి పుకార్లు వస్తే అవి చర్చలుగా మారుతాయి.
ఆడి ఈ-ట్రాన్ వివాదం..
సీనియర్ జర్నలిస్టు లక్మాన్ ఒక వైరల్ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఆజమ్ తన అన్న నుంచి బహుమతిగా పొందినట్లు పేర్కొన్న ఆడి ఈ-ట్రాన్ జీటీ లగ్జరీ కారుపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఇది సాధారణ కారు కాదు. భారతదేశంలో దీని ధర సుమారు రూ.2 కోట్లకు చేరుతుంది. పాకిస్థాన్‌లో మరింత ఖరీదైనది. ఇంత విలాసవంతమైన బహుమతి ఎలా సాధ్యమైంది? అన్న సందేహాన్ని లక్మాన్ బహిరంగంగా వ్యక్తం చేశారు. అదే సమయంలో పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించడం పరిస్థితిని మరింత వేడెక్కించింది.
ఇప్పుడు పాకిస్థాన్‌కు జీవన్మరణ పోరు..
ప్రస్తుత పరిస్థితిలో పాకిస్థాన్ రేపటి గురించి ఆలోచించకుండా ఆడాల్సిన పరిస్థితి. భారీ స్కోరు సాధించి, దాన్ని కాపాడాలి. 64 పరుగుల తేడాతో గెలవడం టీ20 క్రికెట్‌లో చిన్న విషయం కాదు. పవర్‌ప్లేలో దూకుడు, మధ్య ఓవర్లలో నియంత్రణ, చివర్లో విరుచుకుపడే బ్యాటింగ్ — ఇవన్నీ అవసరం.
బాబర్ జట్టులో లేకపోవడం మేనేజ్‌మెంట్ స్పష్టమైన సందేశం. పీసీబీకి దూకుడైన ప్లేయర్, కావాలి.
బాబర్ ఆజమ్ కథ ఇంకా ముగిసిపోలే..
బాబర్ ఆజమ్‌పై విమర్శలు వచ్చాయి. వివాదాలు చుట్టుముట్టాయి. అయినా గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలో పాకిస్థాన్‌కు అతనే అత్యంత స్థిరమైన బ్యాటర్.
ప్రస్తుతం అతను జట్టులో లేకపోయినా, అతని కథ ముగిసిపోలేదు. పాకిస్థాన్ క్రికెట్‌లో ప్రశాంతత ఎక్కువకాలం ఉండదు. తుఫాను లేదా వెలుగులు, కొన్ని సార్లు రెండూ ఒకేసారి వస్తుంటాయి.
పాకిస్థాన్ సెమీస్‌లో చోటు కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో బాబర్ అధ్యాయం ఇంకా కొనసాగుతోంది. క్రికెట్‌లో ఫామ్ తాత్కాలికం, ఫాంలోకి తిరిగి రావడం ఒక ఇన్నింగ్స్ దూరంలోనే ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




