AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: రింకు సింగ్ తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఔట్… మిగిలిన మ్యాచ్‌లకు డౌట్..?

Rinku Singh Family Reason: టీ20 ప్రపంచకప్ 2026 చివరి దశకు చేరింది. సూపర్ 8 దశ మ్యాచ్‌లు ముగిసే సమయం ఆసన్నమైంది. ఇప్పుడంతా సెమీస్ చేరే ఆ రెండు జట్లపైనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో కొంతమంది ఆటగాళ్లు పలు కారణాలతో జట్టును వీడి వెళ్లారు.

T20 World Cup: రింకు సింగ్ తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఔట్… మిగిలిన మ్యాచ్‌లకు డౌట్..?
Rinku Singh
Venkata Chari
|

Updated on: Feb 28, 2026 | 6:12 PM

Share

T20 World Cup Player Family News: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 మధ్యలోనే భారత లోయర్ – ఆర్డర్ బ్యాట్స్‌మన్ రింకు సింగ్ తన తండ్రి మరణంతో జట్టును వీడి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన గైర్హాజరీ టీమిండియా ప్రణాళికలకు దెబ్బతీసినప్పటికీ, త్వరలోనే జట్టుతో మళ్లీ చేరుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు రింకు సింగ్ తర్వాత మరో కీలక ఆటగాడు కూడా కుటుంబ కారణాలతో టోర్నీని మధ్యలోనే వదిలి ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది.

రింకు తర్వాత మరో ఆటగాడు టీ20 వరల్డ్ కప్‌కు దూరం..

రింకు సింగ్ తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ జట్టుకు చెందిన బౌలర్ మ్యాట్ హెన్రీ కూడా టోర్నీని తాత్కాలికంగా వీడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్ అనంతరం మ్యాట్ హెన్రీ స్వదేశానికి వెళ్లనున్నాడు. కారణం ఆయన రెండోసారి తండ్రిగా మారాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివింది: Team India: భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు? ఇదిగో పూర్తి లెక్కలు..!

కుటుంబంలో ఈ ప్రత్యేక సందర్భం కారణంగా హెన్రీ కొంతకాలం జట్టుకు దూరంగా ఉంటాడు. దాంతో టోర్నీలోని వచ్చే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. కాగా, న్యూజిలాండ్ సెమీఫైనల్ అవకాశాలు పాకిస్తాన్ జట్టుపై ఆధారపడి ఉన్నాయి. పాక్ ఓడితే న్యూజిలాండ్ జట్టు సెమీస్ చేరుతుంది.

కుటుంబానికి ప్రాధాన్యం – కోచ్ స్పందన..

న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. హెన్రీ కుటుంబానికి ఇది ఎంతో ప్రత్యేకమైన క్షణమని, జట్టు మొత్తం ఆనందంగా ఉందని తెలిపారు.

టోర్నీ ప్రాధాన్యతను గుర్తు చేస్తూనే, న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు చేరితే వరల్డ్ కప్ చివరి దశలో హెన్రీ మళ్లీ జట్టుతో చేరుతాడనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యక్తిగత సందర్భంలో జట్టు మేనేజ్‌మెంట్ పూర్తిస్థాయి మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు.

టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శన..

టీ20 వరల్డ్ కప్ 2026లో మ్యాట్ హెన్రీ న్యూజిలాండ్‌కు కీలక బౌలర్‌గా నిలిచాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో 6 వికెట్లు తీసి, 7.38 ఎకానమీ రేట్‌తో అద్భుత నియంత్రణ చూపించాడు. పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లలో అతని క్రమశిక్షణ బౌలింగ్ జట్టుకు బలాన్నిచ్చింది.

ఎక్కువమంది చదివింది: PAK vs SL: సెమీస్‌కు పాకిస్తాన్.. శ్రీలంకపై ఎంత తేడాతో గెలవాలంటే? పూర్తి లెక్కలు ఇదిగో..

తిరిగి జట్టులో చేరే అవకాశం ఎప్పుడు..?

న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే, మార్చి 4 లేదా 5న జరిగే నాక్‌అవుట్ మ్యాచ్‌లకు మ్యాట్ హెన్రీ మళ్లీ జట్టుతో చేరే అవకాశం ఉంది.

ప్రస్తుతం న్యూజిలాండ్ దృష్టి ఇంగ్లాండ్‌తో కీలక మ్యాచ్‌పైనే ఉంది. జట్టు టోర్నీలో ముందుకు సాగితే, బౌలింగ్ దాడిని మరింత బలోపేతం చేయడానికి హెన్రీ తిరిగి చేరతాడనే ఆశ ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us