AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs SL: శ్రీలంక టార్గెట్ 213.. పాక్ సెమీస్ చేరాలంటే ఎంత తేడాతో గెలవాలంటే?

టీ20 ప్రపంచ కప్‌లో 10వ సూపర్ 8 మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య కాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 212  పరుగులు చేసింది. దీంతో లంక ముందు 213 పరుగుల టార్గెట్ నిలిచింది.

PAK vs SL: శ్రీలంక టార్గెట్ 213.. పాక్ సెమీస్ చేరాలంటే ఎంత తేడాతో గెలవాలంటే?
Pakistan Semifinal Scenarios
Venkata Chari
|

Updated on: Feb 28, 2026 | 9:00 PM

Share

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా జరుగుతున్న 10వ సూపర్ 8 మ్యాచ్ లో శ్రీలంక జట్టుకు పాకిస్థాన్ 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 212 పరుగులు చేసింది.

సాహిబ్‌జాదా ఫర్హాన్ 60 బంతుల్లో 100 పరుగులు చేయగా, ఫఖర్ జమాన్ 84 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్‌లో ఫర్హాన్ కు ఇది రెండో సెంచరీ. ఒకే టీ20 ప్రపంచ కప్‌లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు. అతని ముందు, క్రిస్ గేల్ రెండు సెంచరీలు చేశాడు, కానీ రెండూ రెండు వేర్వేరు ఎడిషన్లలో వచ్చాయి.

పాక్ జట్టు సెమీస్ చేరాలంటే శ్రీలంక జట్టును కేవలం 147 పరుగులకే కట్టడి చేయాలి. ఒకవేళ శ్రీలంక 148 పరుగులకు పైన చేస్తే న్యూజిలాండ్ జట్టు సెమీస్ చేరుకుంటుంది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార (వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక (కెప్టెన్), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మదుశంక.

పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us