Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI, 2nd T20I: రెండో టీ20 నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఔట్.. లిస్టులో తుఫాన్ ప్లేయర్..

India vs West Indies: భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం గయానాలోని ప్రొవిడెన్స్‌లో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోవ్‌మన్ పావెల్ సారథ్యంలోని విండీస్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో భారత్‌ను 0-1తో వెనక్కు నెట్టింది. ఇప్పుడు రెండో టీ20లో ప్లే-11కి సంబంధించి చర్చలు మొదలయ్యాయి. గయానా T20 ప్లేయింగ్-11 నుంచి ఒకరు కాదు, ఏకంగా ముగ్గురు ఆటగాళ్ళకు బెంచ్ మార్గం చూపించనున్నారంట.

IND vs WI, 2nd T20I: రెండో టీ20 నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఔట్.. లిస్టులో తుఫాన్ ప్లేయర్..
Ind Vs Wi T20i Series
Follow us
Venkata Chari

|

Updated on: Aug 05, 2023 | 6:57 AM

IND vs WI, Playing 11: భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం గయానాలోని ప్రొవిడెన్స్‌లో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోవ్‌మన్ పావెల్ సారథ్యంలోని విండీస్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో భారత్‌ను 0-1తో వెనక్కు నెట్టింది. ఇప్పుడు రెండో టీ20లో ప్లే-11కి సంబంధించి చర్చలు మొదలయ్యాయి. గయానా T20 ప్లేయింగ్-11 నుంచి ఒకరు కాదు, ఏకంగా ముగ్గురు ఆటగాళ్ళకు బెంచ్ మార్గం చూపించనున్నారంట.

4 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్..

ట్రినిడాడ్ వేదికగా గురువారం సాయంత్రం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో భారత జట్టుపై విజయం సాధించింది. డాషింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా తొలి టీ20లో 150 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని, 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్టు 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇవి కూడా చదవండి

ఈ ఆటగాళ్ళు ఔట్..

గయానాలో జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 3 మంది ఆటగాళ్లకు మార్గం చూపవచ్చు. ఇందులో మొదటి పేరు 34 ఏళ్ల వెస్టిండీస్ క్రికెటర్ జాన్సన్ చార్లెస్. ట్రినిడాడ్ టీ20లో మూడో స్థానంలో నిలిచిన చార్లెస్ 3 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత అతడిని కుల్దీప్ యాదవ్ బలిపశువును చేశాడు. కేవలం 6 బంతులు మాత్రమే ఆడగలిగాడు. రెండవ ఆటగాడు అల్జారీ జోసెఫ్ కావచ్చు. జోసెఫ్ అనుభవజ్ఞుడైన క్రికెటర్, కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ అతనిపై చాలా నమ్మకం కలిగి ఉన్నాడు. జోసెఫ్ మొదటి T20 మ్యాచ్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. ఇటువంటి పరిస్థితిలో కెప్టెన్ పావెల్ అతనికి మార్గం చూపగలడు. జోసెఫ్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 9.8 ఎకానమీ రేటుతో 39 పరుగులు చేశాడు.

కైల్ మేయర్స్ కూడా..

ఓపెనర్ కైల్ మేయర్స్ కూడా విండీస్ జట్టు, అభిమానుల అంచనాలను వమ్ముచేశాడు. ఈ సిరీస్‌లోని ఓపెనింగ్ టీ20 మ్యాచ్‌లో మేయర్స్ కేవలం 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. మేయర్స్‌ను యుజ్వేంద్ర చాహల్ ఎల్‌బీడబ్ల్యూ అవుట్ చేసి 7 బంతులు ఆడిన తర్వాత పెవిలియన్‌కు చేరుకున్నాడు. మేయర్స్‌కు 18 టెస్టులు, 28 వన్డేలు, 25 టీ20లు ఆడిన అనుభవం ఉంది. అతను టెస్టులు, ODIలలో 2 సెంచరీలు కూడా చేశాడు. అయితే అలాంటి ప్రదర్శన మరింత కొనసాగితే, అతను ప్లేయింగ్-11లో స్థానం కోసం తహతహలాడాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

1,455 SFTలో సీఎం చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం..ఎక్కడో తెలుసా?
1,455 SFTలో సీఎం చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం..ఎక్కడో తెలుసా?
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
కీర్తి సురేశ్ ‘దోసె’ వీడియోకు.. కొరియా మహిళ డాన్స్‌
కీర్తి సురేశ్ ‘దోసె’ వీడియోకు.. కొరియా మహిళ డాన్స్‌
చారిత్రక కట్టడం చార్మినార్‌ శిధిలమైపోతుందా ??
చారిత్రక కట్టడం చార్మినార్‌ శిధిలమైపోతుందా ??
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి