Video: ప్రాక్టీస్‌లో దుమ్మురేపాడు.. కట్‌చేస్తే.. అరంగేట్రంలో విచిత్రంగా ఔటైన భారత ప్లేయర్.. వైరల్ వీడియో
Prithvi Shaw: భారత యువ స్టార్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షాకు ఈ ఏడాది ఇంతవరకు బాగోలేదు. అతను చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. కానీ, ఈ సంవత్సరం అతను ఐపీఎల్‌లో కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయాడు. ఫీల్డ్ వెలుపల వివాదాలు కూడా పరిస్థితిని కష్టతరం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చుకుని, టీమిండియాకు తిరిగి రావాలనే ఆశతో, పృథ్వీ షా ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌కు చేరుకున్నాడు.
భారత యువ స్టార్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షాకు ఈ ఏడాది ఇంతవరకు బాగోలేదు. అతను చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. కానీ, ఈ సంవత్సరం అతను ఐపీఎల్‌లో కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయాడు. ఫీల్డ్ వెలుపల వివాదాలు కూడా పరిస్థితిని కష్టతరం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చుకుని, టీమిండియాకు తిరిగి రావాలనే ఆశతో, పృథ్వీ షా ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌కు చేరుకున్నాడు. అయితే ఇక్కడ కూడా షా ఆరంభం అంతగా రాణించకపోవడంతో అరంగేట్రం మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడలేక చాలా విచిత్రంగా స్టంప్స్ ఔట్ అయ్యాడు.
23 ఏళ్ల ముంబై ఓపెనర్ పృథ్వీ షా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. అక్కడ అతను నార్తాంప్టన్‌షైర్ కౌంటీ క్లబ్‌లో భాగమయ్యాడు. ప్రస్తుత సీజన్‌లో ఈ కౌంటీ జట్టు కోసం ODI టోర్నమెంట్, T20 బ్లాస్ట్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడేందుకు పృథ్వీ చేరుకున్నాడు. పృథ్వీ షా మొదటిసారి కౌంటీ క్రికెట్‌లో భాగమయ్యాడు. కానీ, అతనికి ఆరంభం అంతగా బాగో లేదు. అతను తన తొలి మ్యాచ్‌లోనే త్వరగా పెవిలియన్ చేరాడు.
సెల్ప్ వికెట్..
HIT WICKET!!!! 🚀
Paul van Meekeren with a fierce bumper that wipes out Prithvi Shaw who kicks his stumps on the way down. What a delivery! Shaw goes for 34.
Northants 54/6.#GoGlos 💛🖤 pic.twitter.com/EMYD30j3vy
— Gloucestershire Cricket (@Gloscricket) August 4, 2023
ఆగస్ట్ 4, శుక్రవారం నాడు, నార్తాంప్టన్ వన్ డే కప్‌లో గ్లౌసెస్టర్‌షైర్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌తో షా ఇంగ్లీష్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అతని జట్టు 279 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. దానికి సమాధానంగా పృథ్వీ తన జట్టుకు ఓపెనింగ్ చేశాడు. ఆరంభం నుంచే నార్తాంప్టన్ వికెట్లు పడటం ప్రారంభించినా.. మరో ఎండ్ నుంచి పృథ్వీ నిలదొక్కుకున్నాడు. అతను వేగంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే అతని వికెట్ అద్భుతమైన బంతికి పడిపోయింది.
నెదర్లాండ్స్‌కు చెందిన పేసర్ పాల్ వాన్ మీకెరెన్ 16వ ఓవర్‌లో గ్లౌసెస్టర్‌కు బౌలింగ్ చేస్తున్నాడు. ఆఖరి బంతికి బౌన్సర్ విసిరాడు. షా దానిని కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, ఫలితం లేకపోవడంతో క్రీజులో పడిపోయాడు. ఈ క్రమంలో కాలు స్టంప్స్‌కి తగిలి బెయిల్స్ పడిపోయాయి. దీంతో షా ఇన్నింగ్స్ ముగిసింది. 34 బంతుల్లో 34 పరుగులు చేశాడు.
భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు..
అంతకుముందు, షా తన మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో నార్తాంప్టన్ రెండవ XIతో జరిగిన మ్యాచ్‌లో బలంగా బ్యాటింగ్ చేసి కేవలం 39 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లో దాన్ని పూర్తిగా పునరావృతం చేయలేకపోయాడు. ప్రస్తుతం పృథ్వీ ఈ టోర్నీలో మరికొన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో అతను మంచి ప్రదర్శన చేయగలడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..