- Telugu News Photo Gallery Add Parsley Tea to diet for many health benefits including immunity and strong bones
Parsley Tea: ఉక్కులాంటి ఎముకల రోజుకు 2 కప్పుల టీ.. తాగారంటే ఆ సమస్యలన్నీ పరార్..
Parsley Tea: ఆరోగ్యాన్ని కాపాడడంలో కూరల్లో ఉపయోగించే కరివేపాకు, కొత్తిమీరకు ప్రముఖ స్థానం ఉంది. ముఖ్యంగా కొత్తిమీరలోని పోషకాలు, ఔషధ లక్షణాలు శరీరానికి చాలా అవసరమైనవిగా ఉంటాయి. అయితే కొత్తిమీర లాగానే దానితో చేసిన టీ కూడా ఆరోగ్య సంరక్షణలో మెరుగ్గా పనిచేస్తుంది. కొత్తిమీర టీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నందున ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడగలిగే శక్తిని కలిగి ఉంటుంది. అసలు కొత్తిమీరతో ఏయే ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 03, 2023 | 5:32 PM

ఎముకల పటిష్టం: కొత్తిమీరలో కాల్షియం, ఫాస్పరస్ అధికంగా ఉన్నందున ఎముకలను బలోపేతం చేయడంలో కూడా ఇది ఉపయోగకపడుతుంది.

రక్త ప్రసరణ: కొత్తిమీర టీలోని ఐరన్ మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపడేలా చేస్తుంది. అలాగే రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునేవారికి కూడా కొత్తిమీర టీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి బరువు తగ్గేలా చేస్తుంది.

రోగనిరోధక శక్తి: విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లను కలిగిన కొత్తిమీర టీ రక్తంలోని ల్యూకోసైట్ల ఉత్పత్తిని ప్రోత్సాహిస్తుంది. ఫలితంగా శరీర రోగనిరోధకశక్తి మెరుగుపడి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.

క్యాన్సర్ నిరోధిని: యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు , కెరోటినాయిడ్లను పుష్కలంగా కలిగిన కొత్తమీర టీ క్యాన్సర్ కణాలను విచ్ఛిన్నం చేసి ఈ ప్రాణాంతక వ్యాధిని నిరోధిస్తుంది.





























