- Telugu News Photo Gallery When buying a new smartphone, they say 'charge it fully and use it': Do you know why?
Tech Tips: కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే పూర్తిగా ఛార్జ్ చేసి వాడాలంటారు? ఎందుకో తెలుసా..?
మీరు ఏదైనా కొత్త మొబైల్ ఫోన్ కొన్నప్పుడు పూర్తిగా ఛార్జింగ్ చేసిన తర్వాతే వాడండి. ఈ కొత్త మొబైల్ ఫోన్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జ్ చేయకుండా ఉపయోగించకండి. కొత్త మొబైల్‌ని కొనుగోలు చేసిన తర్వాత మొబైల్‌ను పూర్తిగా ఛార్జ్ ఎందుకు చేయాలి? ఛార్జింగ్ లేకుండా ఎందుకు ఉపయోగించకూడదు? అదే వాడితే ఏమవుతుంది? దీని వెనుక ఉన్న టెక్నిక్ తెలుసుకోండి. కొనుగోలు చేసిన కొత్త మొబైల్ ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి చాలా మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే..
Updated on: Aug 03, 2023 | 5:23 PM

మీరు ఏదైనా కొత్త మొబైల్ ఫోన్ కొన్నప్పుడు పూర్తిగా ఛార్జింగ్ చేసిన తర్వాతే వాడండి. ఈ కొత్త మొబైల్ ఫోన్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జ్ చేయకుండా ఉపయోగించకండి. కొత్త మొబైల్‌ని కొనుగోలు చేసిన తర్వాత మొబైల్‌ను పూర్తిగా ఛార్జ్ ఎందుకు చేయాలి? ఛార్జింగ్ లేకుండా ఎందుకు ఉపయోగించకూడదు? అదే వాడితే ఏమవుతుంది? దీని వెనుక ఉన్న టెక్నిక్ తెలుసుకోండి.

Li-ion బ్యాటరీ: కొనుగోలు చేసిన కొత్త మొబైల్ ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి చాలా మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే Li-ion బ్యాటరీ ప్రధాన కారణం. లి-అయాన్ బ్యాటరీలోని ప్రతి సెల్ డెప్త్ ఆఫ్ డిస్టార్షన్‌ని తగ్గించాలని మొబైల్ కంపెనీలు సిఫార్సు చేస్తున్నాయి. 100% పూర్తి ఛార్జ్ అంటే బ్యాటరీ డెప్త్ ఆఫ్ డిస్టార్షన్ జీరో శాతం. అప్పుడు మీ మొబైల్‌కి ఎలాంటి సమస్య ఉండదు.

20% కంటే తక్కువగా ఉండాలి: పైన పేర్కొన్న విధంగా, Li-ion బ్యాటరీ DOD (డెప్త్ ఆఫ్ డిస్టార్షన్) మొత్తం 20 శాతంకంటే తక్కువగా ఉండాలి. అంటే, ఫోన్‌ను స్టార్ట్ చేయడానికి పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీ అవసరం. అందుకే బ్యాటరీ కనీసం 20% కంటే తక్కువ డీఓడీని కలిగి ఉండాలి. అంటే 80% ఎక్కువ బ్యాటరీ పవర్ ఛార్జ్ చేయాలి.

హార్డ్‌వేర్ రక్షణ కోసం: చాలా కాలంగా ఉపయోగంలో లేని మొబైల్ బ్యాటరీ, మొబైల్‌లోని అన్ని భాగాలకు ఒకేసారి విద్యుత్ శక్తిని సరఫరా చేయాలి. అలాంటి సమయంలో మొబైల్‌లోని హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌కు ఎక్కువ ఎలక్ట్రికల్ పవర్ అవసరం కాబట్టి మొబైల్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

ఛార్జ్ చేయకపోతే ఏమవుతుంది?: మొబైల్‌లు సిద్ధంగా ఉండి కస్టమర్‌కు చేరుకోవడానికి కనీసం 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో బ్యాటరీ సెల్స్ షార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారణాలే కాకుండా కొత్త మొబైల్ కొనుగోలు చేసిన తర్వాత మొబైల్ చార్జింగ్ పెట్టడానికి మరో కారణం కూడా ఉంది. కొత్త మొబైల్‌ను కొనుగోలు చేసిన తర్వాత వినియోగదారుడు మొబైల్‌ను ఉపయోగించిన పూర్తి అనుభవాన్ని పొందాలి. బ్యాటరీ త్వరగా అయిపోయే ఇబ్బందిని నివారించాలని మొబైల్ కంపెనీలు చెబుతున్నాయి.





























