Tilak Varma: అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగబ్బాయి.. ఒక్క మ్యాచ్‌తోనే ఆ దిగ్గజాలను వెనక్కునెట్టేసిన తిలక్‌

తొలి టీ20 మ్యాచ్‌లోనే అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఇషాన్ కిషన్ పేరిట ఉండేది. ఇషాన్ కిషన్ 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 175.00 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అంతకుముందు అజింక్యా రహానే, రాహుల్ ద్రవిడ్ కూడా ఈ రికార్డులు నెలకొల్పారు.

Tilak Varma: అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగబ్బాయి.. ఒక్క మ్యాచ్‌తోనే  ఆ దిగ్గజాలను వెనక్కునెట్టేసిన తిలక్‌
Tilak Varma
Follow us
Basha Shek

|

Updated on: Aug 05, 2023 | 6:22 PM

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో తెలుగబ్బాయి తిలక్ వర్మ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. ఇప్పుడు సరికొత్త రికార్డును కూడా నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ 22 బంతుల్లో 3 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. అంటే ఈ యువ బ్యాటర్‌ 177.27 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. తద్వారా తొలి టీ20 మ్యాచ్‌లోనే అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఇషాన్ కిషన్ పేరిట ఉండేది. ఇషాన్ కిషన్ 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 175.00 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అంతకుముందు అజింక్యా రహానే, రాహుల్ ద్రవిడ్ కూడా ఈ రికార్డులు నెలకొల్పారు. అజింక్య రహానే 2011లో తన అరంగేట్ర టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 156.41 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక మిస్టర్‌ డిపెండబుల్ రాహుల్‌ ద్రవిడ్‌ 2011లో ఇంగ్లండ్ తో తొలి టీ20 మ్యాచ్‌లో ఏకంగా 147.61 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు తిలక్ వర్మ తన తొలి మ్యాచ్ లోనే 177.27 స్ట్రైక్ రేట్  బ్యాటింగ్ తో సరికొత్త రికార్డు సృష్టించడం విశేషం.

రహానే ,ద్రవిడ్ లను అధిగమించి..

కేవలం బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటాడు తిలక్‌ వర్మ. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు అద్భుత క్యాచ్‌లు పట్టాడీ యంగ్‌ ప్లేయర్‌. జాన్సన్ చార్లెస్, నికోలస్‌ పూరన్‌ల క్యాచ్‌లను బౌండరీ లైన్‌ దగ్గర అద్భుతంగా పట్టుకున్నాడు. తద్వారా అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండు క్యాచ్‌లు పట్టిన సురేష్‌ రైనా రికార్డును తిలక్ సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినా తిలక్‌ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఇక ఐదు వన్డేల సిరీస్‌ లో భాగంగా రెండో మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. ఇందులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. మొదటి మ్యాచ్‌లో జరిగిన తప్పులు పునరావృతం కానీవ్వమని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Tilak Varma (@tilakvarma9)

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?