Annapurna Photo Studio OTT: అప్పుడే ఓటీటీలోకి అన్నపూర్ణ ఫొటో స్టూడియో.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

'30 వెడ్స్‌ 21' వెబ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చైతన్య రావ్‌. పవన్ కల్యాణ్‌ వకీల్‌ సాబ్‌ లాంటి సినిమాల్లోనూ నటించాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. ఈ నేపథ్యంలో చైతన్య రావు నటించిన తాజా చిత్రం అన్నపూర్ణ ఫొటో స్టూడియో. లావణ్య కథానాయిక. ఓ పిట్ట కథ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన చెందు ముద్దు ఈ మూవీని తెరకెక్కించాడు. కామెడీ, ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్,..

Annapurna Photo Studio OTT: అప్పుడే ఓటీటీలోకి అన్నపూర్ణ ఫొటో స్టూడియో..  స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Annapurna Photo Studio Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 04, 2023 | 9:07 PM

’30 వెడ్స్‌ 21′ వెబ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చైతన్య రావ్‌. పవన్ కల్యాణ్‌ వకీల్‌ సాబ్‌ లాంటి సినిమాల్లోనూ నటించాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. ఈ నేపథ్యంలో చైతన్య రావు నటించిన తాజా చిత్రం అన్నపూర్ణ ఫొటో స్టూడియో. లావణ్య కథానాయిక. ఓ పిట్ట కథ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన చెందు ముద్దు ఈ మూవీని తెరకెక్కించాడు. కామెడీ, ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్.. ఇలా అన్ని అంశాలు కలబోసిన అన్నపూర్ణ ఫొటో స్టూడియో జులై 21న థియేటర్లలో విడుదలైంది. మూవీకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ మంచి విజయం సాధించింది. సినిమా మొత్తం పల్లెటూరి నేపథ్యంలో సాగడం, అలాగే ఈ చిత్రంలోని కామెడీ, మలుపులు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ అన్నపూర్ణ ఫొటో స్టూడియో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఈటీవీ వీన్‌లో ఆగస్టు 15 నుంచి ఈ రెట్రో కామెడీ క్రైమ్‌ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియోలోకి అడుగుపెట్టేందుకు రెడీగా ఉండండి. రెట్రో రొమాన్స్, మనసులను కదిలించే ప్రేమకథ, అలాగే ఉత్కంఠకు గురిచేసే సస్పెన్స్‌.. ఇలా అన్నీ కలగలిపిన అన్నపూర్ణ ఫొటో స్టూడియో ఆగస్టు 15 నుంచి ఈటీవీ విన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది’ అని ప్రకటించారు.

అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమాను బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని నిర్మించారు. గతంలో పెళ్లిచూపులు, డియ‌ర్ కామ్రేడ్ వంటి హిట్‌ సినిమాలు ఈ బ్యానర్‌లో వచ్చాయి. అయితే అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ రిలీజ్‌ చేయడంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ రెట్రో కామెడీ ఎంటర్‌టైనర్‌లో మిహిర, ఉత్తర, వైవా రాఘవ, ఆదిత్య, యశ్ రంగినేని, వాసు ఇంటూరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రిన్స్ హెన్రీ స్వరాలు సమకూర్చాడు. మరి థియేటర్లలో అన్నపూర్ణ ఫొటో స్టూడియోను మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.