- Telugu News Photo Gallery Cinema photos Actress Aishwarya Rajesh GV Prakash Kumar Latest Photos Goes Viral
Aishwarya Rajesh: పెళ్లి కూతురి గెటప్‌లో తెలుగమ్మాయి.. ఐశ్వర్యా రాజేష్ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది. ఓవైపు హీరోయిన్ పాత్రలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. అలాగే వెబ్ సిరీస్‌లతోనూ సత్తా చాటుంది. ఇటీవల ఐశ్వర్యా రాజేష్ నటించిన స్వప్న సుందరి, ఫర్హానా సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ అమ్మడు నటించిన చిత్రం డియర్.
Updated on: Aug 02, 2023 | 9:50 PM

స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది. ఓవైపు హీరోయిన్ పాత్రలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. అలాగే వెబ్ సిరీస్‌లతోనూ సత్తా చాటుంది.

ఇటీవల ఐశ్వర్యా రాజేష్ నటించిన స్వప్న సుందరి, ఫర్హానా సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ అమ్మడు నటించిన చిత్రం డియర్. యంగ్ హీరో అండ్ స్టార్ సింగర్ జీవీ ప్రకాష్ కుమార్ ఇందులో కథానాయకుడు.

ఆనంద్ రవిచంద్రన్ తెరకెక్కిస్తోన్న డియర్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. దీంతో చిత్రబృందం గుమ్మడికాయ కొట్టేసింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ అంతా కలిసి సరదాగా ఫొటోలు దిగారు.

అయితే ఈ ఫొటోల్లో హీరోయిన్ ఐశ్వర్య పట్టు చీరలో పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించింది. అలాగే జీవీ ప్రకాష్ కుమార్ కూడా పంచెకట్టుతో పెళ్లి కొడుకులా ఉన్నారు. దీంతో నెట్టింట వీరిద్దరికి పెళ్లి చేసేశారు నెటిజన్స్.

అయితే ఇదంతా డియర్ మూవీ షూటింగ్‌లో భాగంగానే జరిగిందని తెలుసుకుని మళ్లీ నాలుక కర్చుకుంటున్నారు. కాగా ఈ సినిమాకు కూడా జీవీనే స్వరాలు సమకూరుస్తుండడం విశేషం.




