Bhaag Saale: ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ ఎంటర్టైనర్ భాగ్ సాలే.. ఎక్కడ చూడొచ్చంటే..
ప్రస్తుతం శ్రీసింహా హీరోగా ఉస్తాద్ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి ఫణిదీప్ దర్శకత్వం వహించగా.. గౌతమ్ మేనన్ కీలకపాత్ర పోషించారు. బలగం ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఆగస్టులో అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఆయన హీరోగా తెరకెక్కిన సినిమా భాగ్ సాలే. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రానికి ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించగా.. జాన్ విజయ్, రాజీవ్ కనకాల కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఈ కామెడీ ఎంటర్టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రోజు నుంచి భాగ్ సాలే స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమాలో శ్రీసింహా జోడిగా నీహా సోలంకి కథానాయికగా నటించగా.. కాల భైరవ సంగీతం అందించారు. స్టార్ హోటల్ కు యాజమాని కావాలనుకునే అర్జున్ అనే కుర్రాడు.. తన తండ్రితో సొంత ఇంటిని అమ్మిస్తాడు. మరోవైపు ఓ ధనవంతుల బిడ్డ మాయా (నేహా సోలంకి)కి నమ్మిస్తూ ప్రేమలో దించుతాడు. అయితే మాయ ఇంటిపై శామూల్ అనే డాన్ దాడి చేసి ఆమెను కిడ్నాప్ చేస్తాడు. తనకు కావాల్సిన డైమండ్ రింగ్ మాయ ఇంట్లో ఉంటుంది. అయితే ఆ రింగు కు ప€దేద చరిత్ర ఉంటుంది. చివరకు ఆ రింగ్ ఎవరెవరి జీవితాన్ని ఎలా మార్చేసిందనేది సినిమా.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీసింహా హీరోగా ఉస్తాద్ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి ఫణిదీప్ దర్శకత్వం వహించగా.. గౌతమ్ మేనన్ కీలకపాత్ర పోషించారు. బలగం ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఆగస్టులో అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.