AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌.. రంగబలి, పరేషాన్‌ మూవీస్‌ ఎక్కడ చూడొచ్చంటే?

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అలా ఈ వారం ఓటీటీలోకి వచ్చేసిన మూవీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమాలు.. నాగశౌర్య రంగబలి, అలాగే రానా దగ్గుబాటి నిర్మించిన పరేషాన్‌.

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌.. రంగబలి, పరేషాన్‌ మూవీస్‌ ఎక్కడ చూడొచ్చంటే?
Ott Movies
Basha Shek
|

Updated on: Aug 04, 2023 | 3:35 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అలా ఈ వారం ఓటీటీలోకి వచ్చేసిన మూవీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమాలు నాగశౌర్య రంగబలి, అలాగే రానా దగ్గుబాటి నిర్మించిన పరేషాన్‌. ఈ రెండు మంచి కామెడీ ఎంటర్‌ టైనర్‌ మూవీసే. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. థియేటర్లలో విడుదలైన ఈ మూవీస్‌ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. రంగబలి విషయానికొస్తే.. జులై7 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. ఈ అమ్మడికి ఇదే మొదటి చిత్రం. పవన్‌ బాసం శెట్టి తెరకెక్కించిన రంగబలిలో దసరా ఫేమ్‌ షైన్‌ టామ్‌ చాకో విలన్‌గా నటించారు. శరత్‌కుమార్‌, సత్య కీలక పాత్రలు పోషించారు. కామెడీ, లవ్‌, యాక్షన్‌.. ఇలా అన్నీ అంశాలు రంగబలిలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా సత్య కామెడీ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది. థియేటర్లలో మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ రంగబలి సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ముందస్తు ఒప్పందం ప్రకారం శుక్రవారం (ఆగస్టు 4) నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇక ఇవాళే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చిన మరో తెలుగు చిత్రం పరేషాన్‌. మసూదతో ఆకట్టుకున్న తిరువీర్‌ ఈ సినిమాలో హీరోగా నటించాడు. గతంలో కొబ్బరి మట్ట వంటి హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన రూపక్‌ రొనాల్డ్‌ సన్‌ ఈ మూవీని తెరకెక్కించాడు. రానా దగ్గుబాటి నిర్మించిన పరేషాన్‌ సినిమాలో పావని కరణం కథానాయికగా నటించింది. బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, రవి, రాజు బేడిగల తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. జూన్‌ 2న థియేటర్లలో విడుదలైన పరేషాన్‌ ప్రేక్షకులను బాగానే నవ్వించింది. తెలంగాణ నేటివిటీ కథనం కావడంతో చాలామంది ఈ సినిమాకు కనెక్ట్‌ అయ్యారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లివన్‌ పరేషాన్‌ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇవాళ్టి నుంచే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. సో.. థియేటర్లలో ఈ మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమాలను మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి నవ్వుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..