Hatya Movie OTT: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. ‘హత్య’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇప్పటికే పలు హిట్ చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండగా.. మరో కొతత సినిమా అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అదే హత్య. తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా గత నెల జూలై 21న అడియన్స్ ముందుకు వచ్చింది. పోస్టర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచినప్పటికీ.. థియేటర్లలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా ఇప్పుడు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అటు బిగ్ స్క్రీన్ పై సూపర్ హిట్ అయిన చిత్రాలు దాదాపు 45 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని సినిమాలు దాదాపు రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పలు హిట్ చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండగా.. మరో కొతత సినిమా అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అదే హత్య. తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా గత నెల జూలై 21న అడియన్స్ ముందుకు వచ్చింది. పోస్టర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచినప్పటికీ.. థియేటర్లలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓవర్ సీస్ ఓటీటీలో రిలీజైనట్లుగా సమాచారం. ఇక తమిళంతోపాటు.. తెలుగులోనూ ఆగస్ట్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ థ్రిల్లర్ మూవీలో విజయ్ ఆంటోని, మీనాక్షి చౌదరి కీలకపాత్రలలో పోషించారు. మీనాక్షి మోడల్ లైలా పాత్రలో కనిపిస్తుంది. అయితే ఆమె హత్యకు గురవుతుంది. కానీ ఎలాంటి ఆధారాలు లభించవు. దీంతో ఆమె హత్య కేసును డిటెక్టివ్ వినాయక్ (విజయ్ ఆంటోని)తోపాటు ఐపీఎస్ అధికారి సంధ్య దర్యాప్తు చేస్తారు. చివరకు వారిద్దరూ ఈ కేసును ఎలా పరిష్కరించారు ? అనేది సినిమా.
విజయ్ ఆంటోనికి తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. బిచ్చగాడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ కోలీవుడ్ హీరో మూవీస్ కోసం తెలుగు ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈక్రమంలోనే ఇటీవల బిచ్చగాడు సీక్వెల్ తో రాగా.. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. మొదటి సినిమాకు ఉన్న క్రేజ్ వల్ల బిచ్చగాడు 2 చిత్రానికి మంచి బజ్ ఏర్పడినప్పటికీ ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఆ వెంటనే వచ్చిన హత్య చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాతో తమిళంతోపాటు.. తెలుగులోనూ సెన్సెషన్ క్రియేట్ చేశాడు విజయ్ ఆంటోని. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.