Samantha: బాలి వెకేషన్‌లో సమంతతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె సామ్‌కు అంత స్పెషలా?

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతానికి సినిమాల నుంచి విరామం తీసుకుంది. తన శారీరక, మానసిక ఆరోగ్యంపై మరింత దృష్టి సారించేందుకు సుమారు ఏడాది పాటు సామ్‌ సినీ పరిశ్రమకు దూరంగా ఉండనుందని తెలుస్తుంది. ఇందుకోసం ఇప్పటికే అగ్రిమెంట్లు కుదుర్చుకున్న సినిమాల్లో తన షూటింగ్‌ పార్ట్‌ను కూడా కంప్లీట్‌ చేసేసింది. అలాగే కొందరికి అడ్వాన్సులు కూడా తిరి గి చ్చేసంది. మానసిక

Samantha: బాలి వెకేషన్‌లో సమంతతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె సామ్‌కు అంత స్పెషలా?
Samantha
Follow us
Basha Shek

|

Updated on: Aug 02, 2023 | 7:24 PM

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతానికి సినిమాల నుంచి విరామం తీసుకుంది. తన శారీరక, మానసిక ఆరోగ్యంపై మరింత దృష్టి సారించేందుకు సుమారు ఏడాది పాటు సామ్‌ సినీ పరిశ్రమకు దూరంగా ఉండనుందని తెలుస్తుంది. ఇందుకోసం ఇప్పటికే అగ్రిమెంట్లు కుదుర్చుకున్న సినిమాల్లో తన షూటింగ్‌ పార్ట్‌ను కూడా కంప్లీట్‌ చేసేసింది. అలాగే కొందరికి అడ్వాన్సులు కూడా తిరి గి చ్చేసంది. మానసిక ప్రశాంతత కోసం ఇటీవల కోయంబత్తూరులోని ఇషా సెంటర్‌ను సందర్శించింది. అక్కడి సద్గురు మార్గదర్శకత్వంలో యోగా, ధ్యానం చేస్తూ కనిపించింది. ఆ తర్వాత వెంటనే బాలి వెకేషన్‌కు వెళ్లిపోయింది. అక్కడి ప్రకృతి అందాల మధ్య హాయిగా గడుపుతోంది. కాగా సమంత ఒంటరిగా బాలి వెళ్లలేదు. తన స్నేహితురాలని కూడా వెంట తీసుకువెళ్లింది. బాలి వేకేషన్‌కు సంబంధించి సమంత సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలన్నింటిలోనూ ఆమె ఉండడం విశేషం. ఇంతకీ ఆమె ఎవరు? సామ్‌తో ఎలా పరిచయం? అని అభిమానులు, నెటిజన్లు అయోమయంలో పడ్డారు.

మల్టీ ట్యాలెంటెడ్‌..

కాగా గతంలో చెప్పినట్లు సినీ పరిశ్రమలో సమంతకు చాలామంది స్నేహితులు, సన్నిహితులు చాలామంది ఉన్నారు. అయితే అత్యంత సన్నిహితులు మాత్రం సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అలా సమంతతో కలిసి బాలి ట్రిప్ కి వెళ్లిన అమ్మాయి పేరు అనూషా స్వామి. తాను సమంతకు అత్యంత సన్నిహితురాలు. సినిమా రంగానికి కాస్త దూరం అయినా ఆమెకు కూడా కళల పట్ల ఆసక్తి, ప్రావీణ్యం ఉంది. అనూషా స్వామి బహుముఖ ప్రజ్ఞావంతురాలు. భరత నాట్యంలో ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది. అలాగే తను పోల్‌ డ్యాన్స్‌ రూడా. అనూషా స్వామికి సొంతంగా డ్యాన్స్ స్టూడియో ఉంది. అక్కడ పోల్ డ్యాన్స్‌తో సహా అనేక రకాల నృత్యాలు నేర్పిస్తారామె. డ్యాన్స్‌తో పాటు ఫిట్‌నెస్ కూడా అనూష జీవితంలో అంతర్భాగం. అనూష తన శరీరానికి బలం చేకూర్చడం ద్వారా తన మనసును దృఢంగా ఉంచుకుంటుంది.

ఇవి కూడా చదవండి

సేమ్‌ థింకింగ్‌..

అనూష బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కూడా. చాలా మంది సెలబ్రిటీలకు పర్సనల్‌ మేకప్‌ ఆర్టిస్టుగా వర్క్‌ చేసిందామె. అలాగే పలు సినిమాలకు కూడా పనిచేసింది. ఇవి కాకుండా జర్నీ, హైకింగ్, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడల్లో కూడా అనూష పాల్గొంటుంది. డ్యాన్స్, ఫిట్‌నెస్‌తో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలతోనూ కలిసి పనిచేస్తోంది అనూష. పిల్లల చదువుల కోసం పనిచేస్తున్న మిలాప్.. ప్రకృతి పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఓ ఎన్జీవోతోనూ అనూష చేతులు కలిపింది. ఈ క్రమంలో ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన సమంత అదే ఆలోచనలున్న అనూషకు పరిచయమైంది. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయారు. అలా ఇద్దరూ కలిసి బాలి వెళ్లారు. అక్కడ ప్రకృతి అందాల మధ్య సరదాగా గడిపారు.

View this post on Instagram

A post shared by Anusha Swamy (@anushaswamy)

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!